కుచ్‌ ‘కరోనా’.. జర సోచోనా!
close
Published : 10/03/2020 21:24 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కుచ్‌ ‘కరోనా’.. జర సోచోనా!

ఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనా వైరస్‌ ఇప్పుడు ప్రపంచాన్ని భయపెడుతున్న అతి పెద్ద అంశం. ఎన్నో అపోహలు, అనుమానాలు. కొన్ని సాధారణమైన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఈ వైరస్‌ను మన దరికి రాకుండా చేసుకోవచ్చన్న విషయం మీకు తెలుసా! అయితే ఈ సమాచారం మీ కోసమే చదివేయండి. కరోనాను కట్టడి చేయండి.

తుమ్మినపుడు, దగ్గినపుడు తప్పనిసరిగా చేతి రుమాలు అడ్డం పెట్టుకోవాలి. జలుబు, ప్లూ లక్షణాలు ఉన్న వారికి దూరంగా ఉండాలి.  వారు వాడుతున్న వస్తువులు తాకకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. తరచూ సబ్బుతో చేతులు శుభ్రంగా కడుక్కోవాలి.  సబ్బులు, ఆల్కహాల్స్‌తో కూడిన శానిటైజర్లను ఉపయోగించాలి. కరచాలనం వద్దు నమస్కారం ముద్దు అనే ధోరణి అవలంబించాలి. కరోనా వైరస్‌ మన చేతులకు అంటుకున్నా ఎలాంటి ప్రమాదం ఉండదు. అయితే ఆ చేతులను శుభ్రం చేసుకోకుండా ముక్కు, కళ్లను నులుముకోకుడదు. ఇలా చేస్తే వైరస్‌ సోకే ప్రమాదం ఉంది. టాయ్‌లెట్లు వాటి పరిసర ప్రాంతాల్లో ఈ వైరస్‌ ఎక్కువ కాలం సజీవంగా ఉండగలదు. అందువల్ల టాయ్‌లెట్లను ఉపయోగించుకుని వచ్చిన తరువాత కచ్చితంగా చేతులు కడగాలి. మాంసం, గుడ్లు వంటివి బాగా ఉడికిన తరువాతే తినాలి. జలుబు, దగ్గు, జ్వరం, ఛాతి నొప్పి , ఆయాసం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టరును సంప్రదించాలి.

 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని