నిలకడగా కరోనా బాధితుల ఆరోగ్యం: హర్షవర్ధన్‌
close
Updated : 11/03/2020 02:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నిలకడగా కరోనా బాధితుల ఆరోగ్యం: హర్షవర్ధన్‌

దిల్లీ: కరోనా వైరస్‌ బాధితుల ఆరోగ్యం నిలకడగా ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌ ప్రకటించారు. వారందరి ఆరోగ్యం ప్రస్తుతం బాగానే ఉందని, వైరస్‌ నుంచి క్రమంగా కోలుకుంటున్నారని తెలిపారు. తన కార్యాలయం నుంచి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు. మంగళవారం ఆయన కరోనా బాధితులతో వీడియోకాల్‌లో మాట్లాడారు. ఐసోలేషన్ వార్డుల్లో అందిస్తున్న చికిత్సతీరును గురించి అడిగి తెలుసుకున్నారు. కరోనా బాధితులను స్వయంగా కలవాలనుకున్నానని, కానీ డాక్టర్ల సూచన మేరకు ఆగిపోయానని తెలిపారు. చికిత్స విషయంలో కరోనా బాధితులు సంతృప్తి వ్యక్తం చేశారని పేర్కొన్నారు. రోజుకు మూడు సార్లు వాళ్లను వైద్యులు పరీక్షిస్తున్నారన్నారు. చికిత్స పొందుతున్న వారికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరఫున కేంద్రమంత్రి హోలీ శుభాకాంక్షలు తెలిపారు.

వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఆయన దిల్లీ, పంజాబ్‌, హరియాణా, కేరళ, తెలంగాణ, కర్ణాటక, రాజస్థాన్‌, మహారాష్ట్ర, పంజాబ్‌, తమిళనాడు, ఉత్తరప్రదేశ్‌ వైద్యారోగ్యశాఖ మంత్రులతో పాటు లద్దాఖ్‌, జమ్మూకశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌లతో మాట్లాడారు. భారత్‌లో ప్రస్తుతం కరోనా బాధితుల సంఖ్య 59కి చేరింది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని