అంతర్జాతీయ నౌకల ప్రవేశంపై నిషేధం
close
Published : 11/03/2020 21:31 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అంతర్జాతీయ నౌకల ప్రవేశంపై నిషేధం

దిల్లీ: కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. విదేశీయులకు ఇచ్చే వీసాలపై ఇప్పటికే ఆంక్షలు విధించిన కేంద్రం తాజాగా జలమార్గాల్లో వచ్చే ప్రయాణికులపై కూడా తాత్కాలిక నిషేధం విధించింది. ఈ మేరకు విదేశాల నుంచి ప్రయాణికులతో వచ్చే నౌకలను దేశంలోకి అనుమతించబోమని ప్రకటించింది. కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు రవాణాశాఖ పేర్కొంది. 2020 జనవరి 1కి ముందే సమాచారం ఇచ్చిన నౌకలను మాత్రం దేశంలోకి అనుమతిస్తామని తెలిపింది. అలాగే.. ఫిబ్రవరి 1 తర్వాత కరోనా ప్రభావిత దేశాల్లో సంచరించిన ప్రయాణికులను కూడా దేశంలోకి అనుమతించబోమని స్పష్టం చేసింది. ఈ నిషేధం మార్చి 31 వరకూ అమలులో ఉండనుంది.

కరోనా స్ర్కీనింగ్‌ పరీక్షా కేంద్రాలు ఉన్న పోర్టుల నుంచి మాత్రం అంతర్జాతీయ నౌకలను అనుమతించనున్నారు. ప్రయాణికుల్లో ఏ ఒక్కరిలో కరోనా లక్షణాలు కనిపించినా నౌకకు ఇక్కడికి ప్రవేశం ఉండదు. భారత్‌లో 12 ప్రధాన ఓడరేవులున్నాయి. మరో 200 పోర్టులు కూడా ఆయా రాష్ట్ర ప్రభుత్వాల నియంత్రణలో ఉన్నాయి. కాగా.. నెలరోజుల క్రితమే అన్ని ప్రధాన ఓడరేవుల్లో థర్మల్‌ స్క్రీనింగ్‌ కేంద్రాలు ఏర్పాట్లు చేయాలని కేంద్రప్రభుత్వం సూచించింది. దీంతో పాటు మాస్కులు కూడా అందజేయాలని తెలిపింది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని