ఎత్తు చెప్పులు వాడుతున్నారా?
close
Published : 12/03/2020 01:17 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఎత్తు చెప్పులు వాడుతున్నారా?

ఇంటర్నెట్‌డెస్క్‌: క్రమం తప్పకుండా ఎత్తు చెప్పులు వాడే మహిళల ఎముకల ఆరోగ్యంపై ప్రభావం పడుతుందని, కొన్ని సార్లు శాశ్వత వెన్నునొప్పి, ఎముకలకు సంబంధించిన వ్యాధి(ఆస్టియోపోరొసిస్‌)కి దారితీస్తుందని ఓ సర్వే ద్వారా వెల్లడైంది.
‘‘మహిళల కీళ్ల సమస్యలు, ఎముకల ఆరోగ్యం’’ అనే పేరుతో మాక్స్‌ హెల్త్‌కేర్‌(ఎంహెచ్‌సీ) ఈ సర్వేని నిర్వహించింది. ఈ సంస్థ దేశ రాజధాని దిల్లీ, గురుగ్రామ్‌(హరియాణా)కి చెందిన 20 నుంచి 45 ఏళ్ల మధ్య వయసున్న 500 మంది మహిళలపై సర్వే నిర్వహించింది.
‘‘48.5శాతం మంది మహిళలు రోజూ లేదా వారాంతాల్లో ఎత్తు చెప్పులు వాడుతున్నట్లు మా సర్వే ప్రకారం వెల్లడైంది. ఇవి వాడడం వలన మడమలపై ఒత్తిడి పెరుగుతుంది. రక్త ప్రసరణలోనూ ఆటంకం కలుగుతుంది’’ అని హెచ్‌ఎంసీ వెల్లడించింది.

20 నుంచి 30 సంవత్సరాల వయసున్న మహిళల్లో 37.5శాతం మంది రోజూ ఎత్తు చెప్పులు వాడుతున్నట్లు సర్వేలో వెల్లడైంది. ‘‘ఎత్తు చెప్పులు ఇష్టపడని వారిలో కేవలం 14.6శాతం మాత్రమే ఉన్నారు. ఉద్యోగాలు చేసే మహిళల్లో 43.7శాతం మంది వీటిని ఉపయోగిస్తున్నారు. మొత్తం సర్వేలో 50శాతం మహిళలు వారి ఎంపికలపై ఎక్కువ దృష్టి పెట్టట్లేదు. దీంతో వారి ఎముకల ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. కొన్ని సార్లు శాశ్వత వెన్నునొప్పి, ఆస్టియోపోరొసిస్‌కి దారితీస్తుంది. శస్త్రచికిత్సలు చేయాల్సి రావొచ్చు. అందుకే సాధ్యమైనంత వరకు రోజూ వీటిని ధరించకుండా, ప్లాట్‌గా ఉన్నవాటిని ఎంచుకుంటే వారి మడమల ఆరోగ్యానికి మంచిది’’ అని గురుగ్రామ్‌లోని మాక్స్‌ ఆసుపత్రి చైర్మన్‌, చీఫ్‌ సర్జన్‌ ఎస్‌.కె.ఎస్‌ మార్య సూచించారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని