గోదావరి నదికి హారతిచ్చిన పవన్‌
close
Published : 14/03/2020 20:38 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

గోదావరి నదికి హారతిచ్చిన పవన్‌

ధవళేశ్వరం: జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆ పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో పర్యటించారు. పర్యటనలో భాగంగా ఈ సాయంత్రం ధవళేశ్వరంలోని రామ పాదాల రేవు వద్దకు చేరుకున్న పవన్‌.. గోదావరి నదికి హారతి ఇచ్చారు. అనంతరం ‘మన నుడి - మన నది’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ధవళేశ్వరం వద్ద కాసేపు విద్యార్థులతో ముచ్చటించారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ ఉదయం పార్టీ ముఖ్య నేతలతో పవన్‌ సమావేశమయ్యారు. భావితరాలకు మన భాష, సంస్కృతి, స్వచ్ఛమైన నదులను బహుమతులుగా అందించాలనే సంకల్పంతో ‘మన నుడి - మన నది’ కార్యక్రమానికి జనసేన శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని