ఎస్‌ఈసీ కార్యాలయానికి కేంద్ర బలగాలతో భద్రత
close
Published : 19/03/2020 16:39 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఎస్‌ఈసీ కార్యాలయానికి కేంద్ర బలగాలతో భద్రత

విజయవాడ: రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ (ఎస్‌ఈసీ) నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ కార్యాలయానికి కేంద్ర బలగాలతో భద్రత కల్పించారు. దీంతో విజయవాడలోని బందరు రోడ్డులో ఉన్న ఎస్‌ఈసీ కార్యాలయం వద్ద 10 మంది సీఆర్పీఎఫ్‌ పోలీసులు భద్రతగా ఉన్నారు. గన్నవరంలోని సీఆర్పీఎఫ్‌ 39వ బెటాలియన్‌కు చెందిన 1 ఎస్సై, 1 హెడ్‌ కానిస్టేబుల్‌, 8 మంది కానిస్టేబుళ్లతో భద్రత కల్పించారు.

రాష్ట్రంలో స్థానిక ఎన్నికల పరిస్థితులను వివరిస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రమేశ్‌కుమార్‌ రాసినట్లుగా ఉన్న ఒక లేఖ బుధవారం కేంద్ర హోంశాఖకు చేరింది. ఆ లేఖలో ప్రస్తావించిన అంశాలు రాష్ట్ర రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టించాయి. ‘ఆంధ్రప్రదేశ్‌లో నాకు, నా కుటుంబానికి ఎలాంటి భద్రతా లేదు. కేంద్రప్రభుత్వ బలగాలతో రక్షణ కల్పించాలి. ఇక్కడి పాలకుల్లోని ఉన్నతస్థాయి నాయకుల అసహనం, వారి ఫ్యాక్షన్‌ చరిత్ర, కక్షసాధింపు వైఖరితో ఈ నిర్ణయానికి వచ్చాను’ అని ఆ లేఖలో రమేశ్‌కుమార్‌ పేర్కొన్నట్లుగా ఉంది. ఈ నేపథ్యంలో విజయవాడలోని ఎస్‌ఈసీ కార్యాలయానికి కేంద్ర బలగాలతో భద్రత కల్పించడం గమనార్హం.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని