ఇదేనా మాకిచ్చే గౌరవం?:ఎయిమ్స్‌ వైద్యులు
close
Published : 25/03/2020 01:39 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఇదేనా మాకిచ్చే గౌరవం?:ఎయిమ్స్‌ వైద్యులు

దిల్లీ: ప్రస్తుతం కరోనాను కట్టడి చేసే క్రమంలో వైద్యులదే ప్రధానపాత్ర. రాత్రి, పగలు అనే తేడా లేకుండా శ్రమిస్తూ కరోనావైరస్‌పై యుద్ధం చేస్తున్నారు. అయితే వీరు ఉంటున్న అద్దె ఇంటి యజమానులు నుంచి ఓ చిక్కొచ్చిపడింది. కరోనా వైరస్‌ బాధితులకు వైద్యం చేస్తున్నందునా వీరికి కరోనావైరస్‌ సోకి ఉంటుందనే అనుమానంతో ఇళ్లను ఖాళీ చేయమంటున్నారని ఎయిమ్స్‌ డాక్టర్లు కొందరు ఆరోపిస్తున్నారు. ఈ సమస్యను లేఖ ద్వారా కేంద్ర వైద్య ఆరోగ్యమంత్రిత్వశాఖతో పాటు ప్రధానమంత్రి దృష్టికి కూడా తీసుకెళ్లినట్టు ఎయిమ్స్‌ రెసిడెంట్‌ డాక్టర్స్‌ ఆసోసియేషన్‌ తెలిపింది. లేఖలో వారు పేర్కొన్న ప్రకారం.. ‘‘గత కొన్నిరోజులుగా కరోనా వైరస్‌ బాధితులకు వైద్యం చేస్తుండటం వల్ల మేం ఉండే అద్దె ఇళ్ల యజమానులు, కాలనీవాసులు, టౌన్‌షిప్స్‌లో ఉండేవారు ఇళ్లకు వెళ్లకుండా నిలువరిస్తున్నారు. మాకు వైరస్‌ సోకిందోమోనన్న భయంతో ఇలా చేస్తున్నారు. ఈ కారణంగానే చాలామంది వైద్యులు ప్రస్తుతం రోడ్డున పడ్డారు. కొందరు శాస్త్రవేత్తలకు సైతం ఈ పరిస్థితి ఎదురవుతోంది. ప్రభుత్వం కల్పించుకుని ఈ సమస్యకు పరిష్కారం చూపాలి’’ అని వారు కోరారు.  దేశ ప్రజలు బాగుండాలనే ఉద్దేశంతో నిస్వార్థంగా కర్తవ్యాన్ని నిర్వహిస్తున్న తమకు ఇటువంటి పరిస్థితులు ఎదురవడం పట్ల వైద్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లాక్‌డౌన్‌ పరిస్థితులతో వైద్యులు ఆసుపత్రులకు చేరుకోవడానికి ఇబ్బందిగా ఉంటోందని.. దానికి తగిన ఏర్పాట్లు చేయాల్సిందిగా వారు లేఖలో పేర్కొన్నారు. వీరితో పాటు ఆరోగ్య కార్యకర్తలు, దేశీయ విమానయాన సంస్థల సిబ్బందికి కూడా ఇదే తరహా సమస్యలు తలెత్తుతున్నాయి.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని