కరోనాపై పోరుకు పవన్‌ రూ.2కోట్లు విరాళం
close
Published : 26/03/2020 12:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కరోనాపై పోరుకు పవన్‌ రూ.2కోట్లు విరాళం

హైదరాబాద్‌: కరోనా మహమ్మారిపై పోరుకు విరాళాలు భారీగా వస్తున్నాయి. నివారణ చర్యల కోసం జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ తెలుగు రాష్ట్రాలకు కోటి రూపాయలు, ప్రధాన మంత్రి సహాయనిధికి రూ.కోటి విరాళంగా ప్రకటించారు. ప్రధాన మంత్రి సహాయనిధికి రూ. కోటి, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.50లక్షలు, తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.50లక్షల చొప్పున అందజేస్తానని పవన్‌ కల్యాణ్‌ ట్విటర్‌లో వెల్లడించారు. ప్రధాని తీసుకుంటున్న చర్యలు కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు ఉపయోగపడతాయని విశ్వాసం వెలిబుచ్చారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో తనవంతు సాయం చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు ఎంపీలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు భారీగా విరాళాలు ప్రకటించిన విషయం తెలిసిందే.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని