వైరస్‌ పాతదే..కొత్త రూపంలో వణికిస్తోంది!
close
Published : 31/03/2020 18:03 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వైరస్‌ పాతదే..కొత్త రూపంలో వణికిస్తోంది!

ఐపీఎం డైరెక్టర్‌

హైదరాబాద్‌: కరోనా వైరస్‌ పాతదే కానీ కొత్త రూపంతో ప్రపంచాన్ని వణికిస్తోందని హైదరాబాద్‌లోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్రివెంటివ్‌ మెడిసిన్‌ (ఐపీఎం) డైరెక్టర్‌ డాక్టర్‌ శంకర్‌ అన్నారు. తెలంగాణలో ఇప్పటివరకు 77 కరోనా కేసులు నమోదవ్వగా.. ఆరుగురు మృతిచెందారని చెప్పారు. తెలంగాణలో ఇప్పటివరకు 14 మంది కోలుకున్నారన్నారు.  ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఇలాంటి అనేక వైరస్‌లను మనం దిగ్విజయంగా ఎదుర్కొన్నాం. లాక్‌డౌన్‌ను ప్రజలు సరిగా పాటిస్తే వైరస్‌ గొలుసును ఛేదించగలం. అప్రమత్తంగా ఉండాలి. చేతుల శుభ్రం చేసుకోవడంతో పాటు సామాజిక దూరం పాటించాలి. కరోనా వల్ల మరణాలు 2 నుంచి 3 శాతమే’’ అని శంకర్‌ వివరించారు. 

కరోనాకు భయపడవద్దు

కరోనా వైరస్‌కు భయపడకుండా జాగ్రత్త పడాలని అపోలో ఆస్పత్రి వైద్యురాలు డా. సునీత అన్నారు. ఈ వైరస్‌ ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందకుండా జాగ్రత్త పడాలన్నారు.లాక్‌డౌన్‌ని సరిగా పాటించాలని, వైరస్‌ లక్షణాలు ఎక్కువగా ఉంటే తప్పని సరిగా వైద్యులను సంప్రదించాలని కోరారు. హెల్త్ కేర్ ప్రొవైడర్స్‌ని గౌరవించాలన్నారు. లాక్‌డౌన్‌ సమయంలో మానసికంగా ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవాలని, సరైన ఆహార నియమాలు పాటించాలని సూచించారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని