కరోనా మృతుడి అంత్యక్రియలు పూర్తి
close
Updated : 02/04/2020 19:26 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కరోనా మృతుడి అంత్యక్రియలు పూర్తి

నిర్మల్‌: కరోనాతో మృతిచెందిన నిర్మల్‌ జిల్లావాసి అంత్యక్రియలు పూర్తయినట్లు నిర్మల్‌ జిల్లా కలెక్టర్‌ ముషారఫ్‌ అలీ తెలిపారు. నిర్మల్‌కు చెందిన వ్యక్తి కరోనాతో గాంధీలో చికిత్స పొందుతూ నిన్న చనిపోయిన విషయం తెలిసిందే. ఈ మేరకు జిల్లా కలెక్టర్‌ మీడియాకు వివరాలు వెల్లడించారు. మృతుడు దిల్లీలోని నిజాముద్దీన్‌లో తబ్లీగీ జమాత్‌కు వెళ్లొచ్చినట్లు గుర్తించామని కలెక్టర్‌ చెప్పారు. దిల్లీ వెళ్లి వచ్చిన తర్వాత మృతుడు 36 మందిని కలిసినట్లు నిర్ధారణ అయిందని.. వారిని కూడా క్వారంటైన్‌కు తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. కరోనా పాజిటివ్‌తో మృతి చెందిన నేపథ్యంలో మృతుడి కుటుంబం నివాసం ఉంటున్న కాలనీలో కిలోమీటర్‌ మేర దిగ్బంధం చేసినట్లు కలెక్టర్‌ వివరించారు. జిల్లా వ్యాప్తంగా 52 మంది దిల్లీ ప్రార్థనలకు వెళ్లినట్లు గుర్తించామని.. రేపటి నుంచి నిర్మల్‌లో 100 వైద్య బృందాలతో పరీక్షలు నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ వివరించారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని