పవన్‌ విజ్ఞప్తిపై స్పందించిన విదేశాంగ శాఖ
close
Published : 03/04/2020 00:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పవన్‌ విజ్ఞప్తిపై స్పందించిన విదేశాంగ శాఖ

అమరావతి: కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో యూకేలో చిక్కుకుపోయిన భారతీయ విద్యార్థులను ఆదుకోవాలంటూ జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ చేసిన విజ్ఞప్తిపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. భారతీయ విద్యార్థుల భయాందోళనను గురువారం ఉదయం విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి దృష్టికి ట్విటర్‌ ద్వారా తీసుకెళ్లారు. ఈ క్రమంలో విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి మురళీధరన్‌  సాయంత్రం పవన్‌తో ఫోన్‌లో మాట్లాడారు. యూకేలో చిక్కుకున్న భారతీయ విద్యార్థులకు అవసరమైన ఆహారం, వసతి సమకూరుస్తామని హామీ ఇచ్చారు. 

కరోనా వ్యాప్తి మూలంగా వారి తల్లిదండ్రులు ఆందోళనలో ఉన్నారనే విషయాన్ని కేంద్ర విదేశాంగ దృష్టికి పవన్‌ తీసుకెళ్లారు. ‘లండన్‌లో ఉన్న భారత హైకమిసన్‌ కార్యాలయ అధికారులు ఆ విద్యార్థులకు సహాయం అందిస్తారు. ఎవరూ ఆందోళన చెందవద్దు. వారి క్షేమ సమాచారాలను తెలుసుకుంటాం. చిక్కుకున్న విద్యార్థుల వివరాలను అందించండి’ అని పవన్‌కు కేంద్రమంత్రి మురళీధరన్‌ తెలిపినట్లు జనసేన కార్యాలయం వెల్లడించింది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని