జిల్లాకో టెస్టింగ్‌ ల్యాబ్‌ ఏర్పాటు చేయాలి: జగన్‌
close
Published : 05/04/2020 16:33 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

జిల్లాకో టెస్టింగ్‌ ల్యాబ్‌ ఏర్పాటు చేయాలి: జగన్‌

కరోనా నివారణపై సీఎం ఉన్నత స్థాయి సమీక్ష

అమరావతి: రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా ప్రతి ఆస్పత్రిలోనూ ఐసోలేషన్‌ వార్డు ఏర్పాటు చేయాలని సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. ఇప్పుడున్న ల్యాబ్‌ల సామర్థ్యాన్ని పెంచాలని.. ప్రతి జిల్లాలో ఒక కరోనా టెస్టింగ్‌ ల్యాబ్‌ ఏర్పాటు చేయాలని సూచించారు. కరోనా వ్యాప్తి నివారణ చర్యలపై తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. సీఎస్‌ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్‌, వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

దిల్లీలో జమాత్‌కు వెళ్లినవారు, వారి ప్రైమరీ కాంటాక్ట్స్‌కు వీలైనంత వేగంగా పరీక్షలు పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. కరోనా వైరస్‌ సంబంధిత లక్షణాలతో ఎవరొచ్చినా రోగిగానే భావించాలని.. ఆ మేరకు వైద్య సిబ్బంది తగు జాగ్రత్తలు తీసుకుని చికిత్స అందించాలని సూచించారు. దీనిపై ఇప్పటికే జారీ చేసిన మార్గదర్శకాలను పాటించేలా చూడాలని జగన్‌ దిశానిర్దేశం చేశారు. ఆరోగ్య పరిస్థితిపై ప్రతి ఇంటా సర్వే నిరంతరాయంగా కొనసాగించాలని.. వాటి ఆధారంగా తగిన చర్యలు తీసుకోవడంపై సమాయత్తం కావాలని సీఎం మరోసారి స్పష్టం చేశారు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని