‘1902’కాల్స్‌ పరిష్కారంపై దృష్టిపెట్టాలి: జగన్‌
close
Updated : 07/04/2020 20:51 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘1902’కాల్స్‌ పరిష్కారంపై దృష్టిపెట్టాలి: జగన్‌

అమరావతి: రాష్ట్రంలో కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణపై ఉన్నతాధికారులతో ఏపీ సీఎం జగన్‌ మోహన్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో నమోదైన కేసుల్లో ఎక్కువ శాతం దిల్లీకి వెళ్లిన వారు, వారి ప్రైమరీ కాంటాక్టులేనని అధికారులు సీఎంకు వివరించారు. అందరికీ వైద్య పరీక్షలు పూర్తయ్యాయని, దీని తర్వాత ఇంటింటి సర్వే ద్వారా లక్షణాలు ఉన్నవారికి పరీక్షలు నిర్వహిస్తామని వివరించారు. దానికి అనుగుణంగా టెస్టింగ్‌ సామర్థ్యాన్ని పెంచుకుంటున్నామని..రెండు జోన్ల వారీగా క్లస్టర్లు విభజించి అక్కడ కూడా ర్యాండమ్‌ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. సరిపడా టెస్టింగ్‌ కిట్లు తెప్పించుకోవాలని ఈ సందర్భంగా అధికారులను సీఎం జగన్‌ ఆదేశించారు. 

క్వారంటైన్లు, ఐసోలేషన్‌ కేంద్రాల్లో సదుపాయాలకు ఎలాంటి లోటు రాకూడదని సీఎం స్పష్టం చేశారు.ఐసీయూ బెడ్లకు సరిపడా వైద్య సిబ్బందిని నియమించాలని ఆదేశించారు. కరోనా విపత్తు వల్ల చీనీ, బత్తాయి, అరటి, టమోటా రైతులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూడాలని సీఎం దిశానిర్దేశం చేశారు. ఈ విషయంలో ప్రభుత్వం నుంచి నిధుల, ఇతరత్రా మార్గాల్లో నూటికి నూరుశాతం సహకారం అందిస్తామని అధికారులకు జగన్‌ స్పష్టం చేశారు. 1902కు వచ్చే కాల్స్‌ పరిష్కారంపై దృషిపెట్టాలని, సంబంధిత అధికారులు పూర్తి బాధ్యత తీసుకోవాలని సీఎం ఆదేశించారు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని