లాక్‌డౌన్‌ వేళ.. వికసించిన మత సామరస్యం
close
Updated : 08/04/2020 09:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

లాక్‌డౌన్‌ వేళ.. వికసించిన మత సామరస్యం

ఇండోర్‌: 65 ఏళ్ల హిందూ వృద్ధురాలి అంత్యక్రియల్లో ముస్లిం యువకులు సాయం చేసి మత సామరస్యానికి ప్రతీకగా నిలిచారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో శ్మశానవాటికకి ఆమె మృతదేహాన్ని తీసుకువెళ్లడానికి వాహనం లేకపోవడం, కరోనా భయంతో బంధువులు కూడా రాకపోవడంతో.. ఇంటి సమీపంలో ఉండే ముస్లిం యువకులే సాయం చేసి మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ సంఘటన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో చోటుచేసుకుంది. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆ వృద్ధురాలు సోమవారం మరణించింది. ఆమెకు ఇద్దరు కుమారులు ఉన్నారు. ముస్లిం యువకులు మాస్క్‌లు ధరించి ఆమె మృతదేహాన్ని 2.5 కి.మీ దూరంలో ఉన్న శ్మశానవాటికకు తీసుకువెళ్లారు.

దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. మత సామరస్యానికి ప్రతీకగా నిలిచిన ఆ యువకులను సీనియర్‌ కాంగ్రెస్‌ నేత, మాజీ సీఎం కమల్‌నాథ్‌ కొనియాడారు. ‘‘ఆమె ఇద్దరి కుమారులతో పాటు ముస్లిం యువకులు అంత్యక్రియల్లో పాల్గొని భుజాలపై మోసుకెళ్లడం ప్రశంసనీయం. మత సామరస్యానికి ఇది ప్రతీకగా నిలిచింది. ఇది మన సంస్కృతిని ప్రతిబింబిస్తుంది. ఇలాంటి ఘటనలు మనలో ప్రేమ, సోదర భావాన్ని పెంచుతాయి’’ అని ట్వీట్‌ చేశారు. వృద్ధురాలు ఎప్పటి నుంచో తెలుసని, ఆమె అంత్యక్రియల్లో సాయం చేయడం వారి కర్తవ్యమని ముస్లిం యువకులు వ్యాఖ్యానించారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని