రోగనిరోధక శక్తి పెంచుకోండిలా..
close
Updated : 11/04/2020 19:37 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రోగనిరోధక శక్తి పెంచుకోండిలా..

ఆయుష్‌ శాఖ కీలక సూచనలు


 

ఇంటర్నెట్‌డెస్క్‌: కరోనా మహమ్మారి (కొవిడ్ 19) యావత్‌ ప్రపంచ దేశాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఈ వైరస్‌ దెబ్బకు ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలూ కుదేలవుతున్నాయి. ఈ మహమ్మారి భారత్‌లోనూ తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ వైరస్‌ను కట్టడి చేసేందుకు భారత ప్రభుత్వం మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. రాష్ట్రాలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయడంతో పాటు ప్రజలకు పలు సూచనలు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ మహమ్మారి బారినపడకుండా మనల్ని మనం కాపాడుకొనేలా రోగ నిరోధక శక్తిని (ఇమ్యూనిటీ పవర్‌) పెంచుకొనేందుకు ఆయుష్‌ మంత్రిత్వశాఖ పలు కీలక సూచనలు చేసింది. 

> ఎప్పుడు దాహం వేసినా గోరువెచ్చని నీరు తాగండి.
> ప్రతి రోజూ కనీసం 30 నిమిషాల పాటు యోగాసనాలు, ప్రాణాయామం, ధ్యానం చేయాలి.
> వంటకాల్లో పసుపు, జీలకర్ర, దనియాలు, వెల్లుల్లి తప్పకుండా ఉండేలా చూసుకోండి
> తులసి, దాల్చిన చెక్క, నల్ల మిరియాలు, శొంఠి, ఎండు ద్రాక్ష మొదలైన వాటితో చేసిన ఆయుర్వేద తేనీరును రోజుకు ఒకటి నుంచి రెండుసార్లు తాగండి. అలాగే, మీ అభిరుచిని బట్టి బెల్లం లేదా తాజా నిమ్మరసాన్ని కలుపుకోవచ్చు.
> 150 మిల్లీ లీటర్ల పాలలో అర స్పూను పసుపు కలుపుకొని రోజుకు ఒకటి లేదా రెండుసార్లు తాగండి.
> నువ్వుల నూనె/కొబ్బరినూనె/ నెయ్యిని ముక్కు రంధ్రాల దగ్గర పట్టించండి. దీనిని ఉదయం, సాయంత్రం చేయండి.
> ఒక టేబుల్‌ స్పూన్‌ నువ్వుల నూనె/ కొబ్బరి నూనె తీసుకొని నోటిలో వేసుకొని రెండు మూడు నిమిషాల పాటు పుక్కిలించి తర్వాత ఉమ్మివేయాలి. ఆ తరువాత వెంటనే నోటిని గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ పనిని రోజుకు ఒకటి రెండుసార్లు చేయవచ్చు.
> పొడి దగ్గు ఉంటే పుదీనా ఆకులను లేదా సోంపు గింజలను కలిపిన నీటి ఆవిరిని రోజుకు ఒకసారి పీల్చుకోవాలి.
> లవంగాల పొడిని బెల్లంతో లేదా తేనెతో కలుపుకొని రోజుకు రెండు మూడు సార్లు తీసుకుంటే దగ్గు/ గొంతు గరగర నుంచి ఉపశమనం లభిస్తుంది. ఒకవేళ దగ్గు ఎక్కువగా ఉంటే తప్పకుండా వైద్యులను సంప్రదించాలి.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని