రేషన్‌ దుకాణాల్లో కౌంటర్లు పెంచాలి: జగన్‌
close
Updated : 14/04/2020 15:54 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రేషన్‌ దుకాణాల్లో కౌంటర్లు పెంచాలి: జగన్‌

అమరావతి: 14 రోజులు పూర్తయిన వాళ్లను ఇంకా క్వారంటైన్‌ కేంద్రాల్లో ఉంచుతున్నారని.. నిర్దేశించుకున్న వైద్య విధాన ప్రక్రియను పూర్తిచేసి వారిని ఇళ్లకు పంపించాలని ఏపీ సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. ఒకటికి రెండుసార్లు పరీక్షలు చేసి నెగిటివ్‌ వస్తే పంపించాలని సూచించారు. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఇళ్లకు వెళ్లే వారికి పౌష్టికాహారం తీసుకొనేలా సూచనలు చేయాలన్నారు. కరోనా వ్యాధి లక్షణాలు ఉన్నవారికి అత్యుత్తమ వైద్యం అందించాలని.. క్వారంటైన్‌ కేంద్రాల్లో మంచి సదుపాయాలు ఉండాలని సీఎం ఆదేశించారు. ప్రతి ఆస్పత్రిలో ఐసోలేషన్‌ సదుపాయం ఉండాలని చెప్పారు. వైద్య సిబ్బందికి మాస్కులు, పీపీఈలు అందుబాటులో ఉంచాలని అధికారులను జగన్‌ ఆదేశించారు.

ఈనెల 16 నుంచి మరోదఫా రేషన్‌ పంపిణీ దృష్ట్యా కౌంటర్ల సంఖ్యను పెంచాలని సీఎం సూచించారు. అర్హత ఉన్నవారు వస్తే రేషన్‌కార్డు ఇవ్వాలని చెప్పారు. ఎవరు రేషన్‌ అడిగినా ఇవ్వాలని .. ఆహారం లేని పరిస్థితి ఉండొద్దన్నారు. గ్రామస్థాయిలో ధాన్యం కొనుగోలు చేస్తున్నామని.. తెలంగాణ నుంచి సైతం ధాన్యం రాష్ట్రంలోకి రాకుండా నిలిపివేశామని సీఎం వివరించారు. మద్దతు ధర కన్నా తక్కువకు కొనుగోలు చేసే పరిస్థితి రావొద్దని.. సరిహద్దుల నుంచి ధాన్యం రాష్ట్రంలోకి రాకుండా కలెక్టర్లు చర్యలు చేపట్టాలన్నారు. ఏ సమస్య ఉన్నా సీఎంవో దృష్టికి తీసుకు రావాలని సీఎం ఆదేశించారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని