ఆ లేఖ రాసింది నేనే:నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌
close
Updated : 16/04/2020 14:29 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆ లేఖ రాసింది నేనే:నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌

అమరావతి: గతంలో కేంద్రహోంశాఖకు రాసిన లేఖ వివాదంపై రాష్ట్ర మాజీ ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ వివరణ ఇచ్చారు. కేంద్రహోంశాఖ కార్యదర్శికి లేఖ రాసింది తానేనని స్పష్టం చేశారు. ఈ అంశంపై ఎంపీ విజయసాయిరెడ్డి సహా వైకాపా నేతల ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో తాజాగా ఆయన స్పందించారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు.

‘‘రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ హోదాలో ఆ లేఖ నేనే రాశా. ఎన్నికల కమిషనర్‌గా నాకున్న అధికార పరిధిలోనే లేఖ రాశాను. ఆ లేఖపై ఎవరికీ ఎలాంటి సందేహాలూ అవసరం లేదు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కూడా దాన్ని నిర్ధారించారు. దీనిపై ఎలాంటి ఆందోళన, సందేహాలు అవసరం లేదు. దీనిపై ఎలాంటి వివాదాలు, రాద్ధాంతాలకు తావులేదు’’ అని రమేశ్‌కుమార్ పేర్కొన్నారు.Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని