కార్మికలోకం శ్రమను గౌరవించాలి: పవన్‌
close
Published : 30/04/2020 15:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కార్మికలోకం శ్రమను గౌరవించాలి: పవన్‌

అమరావతి: ఏ దేశ ఆర్థిక పురోగతికైనా శ్రామికుల కష్టించేతత్వమే ప్రధాన ఇంధనమని.. కార్మిక లోకం శ్రమను గుర్తించి గౌరవించడం అందరి బాధ్యతని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. కార్మిక దినోత్సవం (మేడే) సందర్భంగా ఆ బాధ్యతను మరోసారి గుర్తుచేసుకోవాలని చెప్పారు. యావత్ కార్మిక లోకానికి జనసేన పార్టీ తరఫున పవన్‌ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కరోనా మూలంగా తలెత్తుతున్న పరిస్థితుల ప్రభావం కార్మికులపై పడే ప్రమాదం ఉందని.. ఈ కష్ట కాలంలో వారి సమస్యలపై అందరూ సానుభూతితో స్పందించాలన్నారు. వారి ఉపాధికి చట్టబద్ధమైన రక్షణ కలిగించడంపై ప్రభుత్వాలు దృష్టి సారించి ఎంతో పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలు ఈ సమయంలో పకడ్బందీగా అమలయ్యేలా చూడాలని పవన్ కోరారు. అసంఘటిత రంగాల్లోని కార్మికుల సంక్షేమం గురించి తగిన చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి సూచించారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని