సెంట్రల్‌ విస్టా ప్రాజెక్ట్‌పై స్టేకు ‘సుప్రీం’ నిరాకరణ
close
Published : 30/04/2020 17:36 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సెంట్రల్‌ విస్టా ప్రాజెక్ట్‌పై స్టేకు ‘సుప్రీం’ నిరాకరణ

న్యూదిల్లీ: దేశరాజధాని దిల్లీ నడిబొడ్డున ల్యుటెన్స్‌ జోన్‌లో రూ.20 వేల కోట్ల వ్యయంతో పార్లమెంట్‌ నూతన భవనం, సెక్రెటేరియేట్‌, ఇతర నిర్మాణాలకు ఉద్దేశించిన ‘సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్‌’పై స్టే విధించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో భూసేకరణను సవాల్‌ చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలైంది. దీనిపై సీజేఐ ఎస్‌ఏ బోబ్డే, జస్టిస్‌ అనిరుద్ధ బోస్‌ బెంచ్‌ గురువారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విచారణ చేపట్టింది. స్టే విధించేందుకు నిరాకరించింది. ఈ ప్రాజెక్టుపై ఇదే తరహాలో మరో పిటిషన్‌ కూడా పెండింగ్‌లో ఉందని.. ప్రస్తుత తరుణంలో దాన్ని అత్యవసరంగా విచారించాల్సిన అవసరం లేదని సీజేఐ అన్నారు. ఇప్పుడున్న పార్లమెంట్‌ భవనం ప్రస్తుత అవసరాలకు సరిపోవడం లేదు. ఈ నేపథ్యంలో 2024 కల్లా ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని