రెండో రక్షణ వలయాన్ని సిద్ధం చేయాలి
close
Published : 04/05/2020 01:17 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రెండో రక్షణ వలయాన్ని సిద్ధం చేయాలి

రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ సూచన

దిల్లీ: దేశవ్యాప్తంగా పలు చోట్ల పోలీసు బలగాలు కరోనా బారిన పడుతుండటంతో కేంద్ర హోంశాఖ అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో కరోనా సవాళ్లను ఎదుర్కోవడంతోపాటు నియంత్రణ వ్యూహాలను కొనసాగించేందుకు కరోనా సోకిన పోలీసు సిబ్బంది స్థానంలో రెండో రక్షణ వలయాన్ని సిద్ధం చేయాలని ఆదివారం రాష్ట్రాల సీఎస్‌లు, డీజీపీలు, కేంద్ర పారా మిలిటరీ బలగాలకు సూచించింది. ఈ క్రమంలో హోంగార్డులు, సివిల్‌ డిఫెన్స్‌, ఎన్‌సీసీ, స్కౌట్స్‌, గైడ్స్‌, స్టూడెంట్ పోలీస్‌ కేడెట్ల సేవలను వినియోగించుకోవాలని చెప్పింది.

సహాయ కేంద్రాలు, అత్యవసర సేవల సమన్వయానికి వీరి సేవలు దోహదపడతాయని హోంశాఖ పేర్కొంది. దీంతో పాటు క్షేత్రస్థాయిలో ఉండని సిబ్బందికి ఇంటి నుంచే పని చేసే అవకాశాలను పరిశీలించాలంది. పోలీసులు సైతం.. ప్రజల విషయంలో సానుభూతి, దయతో వ్యవహరించాలని సూచించింది. ఆయా కార్యక్రమాలు, పండగల్లో అందరూ సామాజిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని తెలిపింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తగా ఉండాలని పేర్కొంది. దిల్లీలో ఇటీవల వందకుపైగా సీఆర్పీఎఫ్‌ సిబ్బందికి కరోనా సోకిన విషయం తెలిసిందే.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని