పాక్‌కు సరైన జవాబు ఇస్తాం
close
Published : 04/05/2020 21:24 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పాక్‌కు సరైన జవాబు ఇస్తాం

సైన్యాధిపతి జనరల్‌ ఎం.ఎం.నరవణే

దిల్లీ: జమ్మూ- కశ్మీర్‌లోకి ఉగ్రవాదులను పంపుతూ పాకిస్తాన్‌ తన సంకుచిత ధోరణిని ప్రదర్శిస్తూనే ఉందని భారత  సైన్యాధిపతి జనరల్‌ ఎం.ఎం.నరవణే విమర్శించారు. కాల్పుల విరమణ ఉల్లంఘనలు, ఉగ్రవాదానికి అండగా నిలవడం మానకపోతే భారత్‌ తగిన జవాబు చెబుతుందని సోమవారం స్పష్టం చేశారు. హన్‌ద్వారాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో వీరమరణం పొందిన ఐదుగురు భద్రతా సిబ్బంది పట్ల దేశం గర్విస్తోందన్నా. ఎల్‌ఓసీ వద్ద చొరబాటు యత్నాలను చూస్తుంటే.. ఆ దేశానికి తీవ్రవాదులను ఇటు పంపడంపైనే తప్ప.. స్థానికంగా కరోనాను కట్టడి చేసే ఉద్దేశం లేదన్నట్లు తెలుస్తోందన్నారు. ఇటీవల ‘సార్క్‌’ దేశాల వీడియో కాన్ఫరెన్స్‌లో వ్యవహరించిన తీరు, ఉగ్రవాదుల జాబితానుంచి పలువురిని తొలగించడం వంటివి పాక్‌ వైఖరిని తేటతెల్లం చేస్తూనే ఉన్నాయని చెప్పారు. ఉగ్రవాదులకు ఆర్థిక సహకారం, హవాలా వ్యవహారాల కట్టడి కోసం ఫైనాన్సియల్‌ యాక్షన్‌ టాస్క్‌ఫోర్స్(ఎఫ్‌ఏటీఎఫ్‌) రూపొందించిన సిఫార్సుల అమలులో అంతర్జాతీయ సమాజాన్ని తప్పుదోవ పట్టించేందుకు యత్నిస్తోందని ఆరోపించారు. అటు అఫ్గానిస్తాన్‌లోనూ తాలిబాన్లకు సైనిక, ఆర్థికపరంగా మద్దతిస్తోందని దుయ్యబట్టారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని