కరోనాను అడ్డుకొనే యాంటీబాడీ గుర్తింపు
close
Published : 05/05/2020 07:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కరోనాను అడ్డుకొనే యాంటీబాడీ గుర్తింపు

కరోనావైరస్‌ మనిషి శరీరంలో వ్యాపించకుండా అడ్డుకొనే యాంటీబాడీని గుర్తించినట్లు ఉట్రేచ్ట్‌ యూనివర్సిటీలోని ‘ఎరాస్మస్‌ మెడికల్‌ సెంటర్‌ అండ్‌ హార్బర్‌ బయోమెడ్‌’(హెచ్‌బీఎం) ఒక ప్రకటనలో వెల్లడించింది. ‘నేచర్‌ కమ్యూనికేషన్స్‌’ అనే ఆన్‌లైన్‌ పత్రికలో దీనిని ప్రచురించారు. కరోనా చికిత్సలో దీనిని కీలక అడుగుగా ఆ పత్రిక అభివర్ణించింది. ఈ కణం ‘సార్స్‌ కోవ్‌ 2’లోకి ఒక కణాన్ని పట్టుకొని వ్యాప్తిని అడ్డుకొంటుందని ఈ పరిశోధనకు అధ్యక్షత వహించిన డాక్టర్‌ బాష్‌ వెల్లడించారు. ‘‘ఈ యాంటీబాడీకి ఉన్న క్రాస్‌ న్యూట్రలైజింగ్‌ గుణం ఆసక్తికరంగా ఉంది. ఇది కరోనావైరస్‌ అడ్డుకోవడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ‘సార్స్‌ కోవ్‌ 1’ యాంటీ బాడీలను ఉపయోగించి ‘సార్స్‌ కోవ్‌ 2’ను అడ్డుకొనే వ్యాధి నిరోధక కణాలను గుర్తించాం’’ అని ఆయన వెల్లడించారు. దీనిపై హెచ్‌బీఎం ఛైర్మన్‌ డాక్టర్‌ జింగ్‌సాంగ్‌ వాంగ్‌ మాట్లాడుతూ ‘‘ఇది కీలకమలుపు. ఈ యాంటీబాడీ మానవ శరీరంలో వ్యాధి తీవ్రతను ఎంతమేరకు నిలువరిస్తుందనే అంశంపై  మరింత పరిశోధనలు చేయాలి. మా భాగస్వాములతో కలిసి ఈ పరిశోధనలను ముందుకు తీసుకెళతాం. ప్రస్తుత అత్యవసర పరిస్థితుల్లో మా పరిశోధన ప్రయోజనకరంగా ఉంటుందని భావిస్తున్నాను’’ అని తెలిపారు.  1636లో నెలకొల్పిన ఉట్రేచ్ట్‌ యూనివర్సిటీ ఐరోపాలో అతిపెద్ద పరిశోధన విశ్వవిద్యాలయం. ఇక్కడ దాదాపు 30 వేల మంది విద్యార్థులున్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని