రాజమహేంద్రవరంలో వలస కూలీల ఆందోళన
close
Published : 06/05/2020 10:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రాజమహేంద్రవరంలో వలస కూలీల ఆందోళన

రాజమహేంద్రవరం: స్వస్థలాలకు వెళ్లేందుకు వలసకూలీలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు పనులకోసం బిహార్‌, జార్ఖండ్‌, చత్తీస్‌ఘడ్‌ రాష్ట్రాల నుంచి దాదాపు 400 మంది వలస కూలీలు వచ్చారు. కరోనా వైరస్‌ లాక్‌డౌన్‌ నేపథ్యంలో వీరందరినీ తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం నన్నయ వర్సిటీలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రంలో ఉంచారు. వలసకూలీలను స్వస్థలాలకు పంపేందుకు అనుమతిస్తున్నట్టు కేంద్రం ప్రకటించడంతో స్వరాష్ట్రాలకు వెళ్లేందుకు వారంతా సిద్ధమయ్యారు. బుధవారం ఉదయం వీరంతా నన్నయ వర్సిటీ నుంచి రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్‌కు బయల్దేరారు. లాలా చెరువు కూడలి వద్ద  రాజానగరం, రాజమహేంద్రవరం, బొమ్మూరు ఎస్‌ఐలు, సిబ్బంది  వలస కూలీలను ఆపే ప్రయత్నం చేసినా వారు లెక్కచేయకుండా ముందుకు కదిలారు. రైళ్లలో సొంతుళ్లకు పంపించాలని డిమాండ్‌ చేశారు. ఇప్పటికిప్పుడు రైళ్లు ఏర్పాటు చేయడం సాధ్యం కాదని, కొంత సమయం ఇవ్వాలని అధికారులు, పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నప్పటికీ వలస కూలీలు ఆందోళన కొనసాగిస్తున్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని