మాజీ ఎమ్మెల్యే శివారెడ్డి కన్నుమూత
close
Published : 08/05/2020 11:44 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మాజీ ఎమ్మెల్యే శివారెడ్డి కన్నుమూత

ప్రొద్దుటూరు: కడప జిల్లా కమలాపురం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే పేర్ల శివారెడ్డి(83) కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ప్రొద్దుటూరులోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందారు. శుక్రవారం ఉదయం స్థానిక వైఎంఆర్‌ కాలనీలోని స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. శివారెడ్డి 1978లో కమలాపురం నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఎన్నికయ్యారు. దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా ఉండేవారు. శివారెడ్డి మృతితో ఆయన స్వగ్రామమైన ఎర్రగుంట్లలో విషాదఛాయలు అలముకున్నాయి. ప్రొద్దుటూరులో సాయంత్రం 4గంటలకు అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు బంధువులు తెలిపారు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని