‘సింగం’ పోలీసుకు రూ.5 వేల జరిమానా
close
Updated : 06/08/2020 13:32 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘సింగం’ పోలీసుకు రూ.5 వేల జరిమానా

రెండు కార్లపై నిల్చొని సాహసం చేసినందుకు..

దామోహ్‌: మధ్యప్రదేశ్‌లో ఓ పోలీస్‌ అధికారి చేసిన సినిమా స్టంట్‌కు ఉన్నతాధికారులు జరిమానా విధించారు. ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్‌ అవడంతో సంబంధిత అధికారిని హెచ్చరించి వదిలేశారు. మరోసారి ఇలా చేయొద్దని తీవ్రంగా మందలించారు.

అసలేం జరిగిందంటే.. దామోహ్‌ జిల్లాలోని నార్సింగ్‌గర్హ్‌ ఎస్సై మనోజ్‌ యాదవ్‌ ఇటీవల బాలీవుడ్‌ సినిమాలోని ఓ స్టంట్‌ని అనుకరిస్తూ ప్రమాదకర సాహసం చేశాడు. దీనికి ‘సింగం’ సినిమాలోని టైటిల్‌ సాంగ్‌ను బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌గా పెట్టాడు. 1991లో వచ్చిన ‘ఫూల్‌ ఔర్‌ కాంటే’ సినిమాలో అజయ్‌దేవ్‌గణ్‌ రెండు బైక్‌లపై నిల్చొని వెళ్తున్న విధంగా ఆ ఎస్సై కూడా పోలీసు దుస్తులు ధరించి రెండు కార్లపై నిల్చొనే స్టంట్‌ చేశారు. ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారడంతో అధికారులు విచారణ జరిపారు. జిల్లా ఎస్పీ హేమంత్‌ చౌహన్‌.. సంబంధిత ఎస్సైకి రూ.5వేల జరిమానా విధించి, ఇలాంటి వీడియోలు మరోసారి చేయొద్దని హెచ్చరించారు. అలాంటివి ప్రమాదకరమని, యువతపై ప్రభావం చూపుతాయని మందలించారు.

 

 

 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని