కేసులు పెరుగుతున్నా భయం అవసరం లేదు 
close
Updated : 12/05/2020 20:18 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కేసులు పెరుగుతున్నా భయం అవసరం లేదు 

కరోనా నియంత్రణకు రాష్ట్రంలో మొదటి ప్లాస్మాదాత అఖిల్‌తో ముఖాముఖి..

హైదరాబాద్‌ : ప్రపంచ మహమ్మారి కరోనా కోరల్లో చిక్కుకున్న వారికి ఇప్పుడు కనిపిస్తున్న ఏకైక వైద్యం ప్లాస్మా థెరపి. ఇందులో భాగంగా ఇప్పటికే కరోనా నుంచి కోలుకుని 28 రోజులు పూర్తి చేసుకున్న వారి నుంచి ప్లాస్మా సేకరించడంలో గాంధీ వైద్యులు నిమగ్నమయ్యారు. మార్చిలో కొవిడ్ బారిన పడి కొలుకున్న అఖిల్‌ అనే యువకుడు రాష్ట్రంలో మొదటి ప్లాస్మా దాతగా నిలిచాడు. కరోనా బారిన పడిన ఆయన ఎదుర్కొన్న సవాళ్లు, ప్లాస్మా దాతగా కావడానికి సంబంధించిన వివరాలపై అఖిల్‌తో ఈటీవీ ముఖాముఖి... 

కరోనా బారిన పడినప్పుడు మీకు ఎలా తెలిసింది.. ఎలాంటి లక్షణాలు బయటపడ్డాయి.. ఆసుపత్రిని ఎలా ఆశ్రయించారు?

విదేశాల నుంచి వచ్చినప్పుడు నాకు ఎలాంటి లక్షణాలు లేవు. ఐసోలేషన్‌లో  ఉన్నప్పుడు కూడా ఎలాంటి లక్షణాలు కనిపించలేదు.  ఈ వ్యాధి బారిన పడిన అందరిలో లక్షణాలు కనిపించకపోవచ్చు. కాబట్టి విమానాశ్రయానికి చేరుకున్నతరువాత ఇంటికి వెళ్లకుండా నేరుగా గాంధీ ఆసుపత్రికి వెళ్లాను. పరీక్షల్లో కరోనా పాజిటివ్ వచ్చింది. వైద్యం కోసం 15 రోజులు ఐసోలేషన్‌లో ఉన్నాను. నాకు కరోనా వచ్చినట్లు చెబితే ముందు ఎవరూ నమ్మలేదు. అప్పటికి ఇంకా వైరస్‌ ప్రభావం పెద్దగా లేదు. లాక్‌డౌన్‌ కూడా లేదు. ఐసోలేషన్‌ ప్రక్రియ సున్నితంగా గడిచిపోయింది. నాకు ఎలాంటి ఇబ్బంది కలగలేదు. కరోనా బారి నుంచి బయట పడడానికి నా శరీరంలోని రోగనిరోధక శక్తి కృషి చేసింది. 

మీకు కరోనా సోకిన సమయంలో ప్రజలు అప్పటికే కరోనా గురించి తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఒక్కరికి కరోనా సోకితే చుట్టుపక్కల వారు అక్కడ ఉండడానికే భయపడుతున్నారు.  అలాంటి సందర్భంలో మీరు ఎలాంటి మానసిక పరిస్థితిని ఎదుర్కొన్నారు.. కుటుంబ సభ్యులతో ఎలా మాట్లాడారు?

ఈ విషయంలో నేను చాలా అదృష్టవంతుడిని. నాపై ఎవరు కూడా వివక్ష చూపలేదు. కానీ కరోనా బాధితులను కొందరు దూరంగా ఉంచడంతో వారు మరింత మానసిక ఆందోళనకు గురయ్యారు. నా కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులు నన్ను చాలా ప్రోత్సహించారు. విమానాశ్రయం నుంచి ఇంటికి రాకుండా  ఆసుపత్రికి వెళ్లి చాలా మంచి పని చేశావని అభినందించారు. కరోనా సోకిన వారిలో 95 శాతం మంది  కోలుకుంటున్నారు. కేసులు పెరిగినా భయపడే అవసరం లేదు. కానీ చాలా మంది కరోనా వస్తుందనే భయంతో ఆందోళన చెందుతున్నారు. 

కరోనా నియంత్రణకు రాష్ట్రంలో మొదటి ప్లాస్మాదాతగా నిలవడం అభినందనీయం. దీనికిగానూ వైద్యులు మిమ్మల్ని ఎలా సంప్రదించారు?మీరు ఎలా భావిస్తున్నారు? 

ఢిశ్చార్జి అయ్యేటపుడే వైద్యులు నాకు చెప్పారు. మన దగ్గర ప్లాస్మా దానానికి ఇంకా అనుమతి లేదు. అనుమతి వచ్చినప్పుడు నన్ను సంప్రదిస్తామని చెప్పారు. అప్పటి నుంచే నేను వైద్యులతో టచ్‌లో ఉన్నాను. ఐసీఎంఆర్ నుంచి గాంధీ ఆసుపత్రికి అనుమతి రాగానే వారు నన్ను సంప్రదించారు. ప్లాస్మా దానం చేస్తున్నానని తెలుసుగానీ రాష్ట్రంలో నేనే మొదటి దాతను అని తెలవదు.. మరింత మంది ప్లాస్మాదాతలకు మార్గదర్శకంగా ఉండడంపై చాలా ఆనందంగా ఉంది. 

 

 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని