భారత్‌ నుంచి పాక్‌కు ఔషధాలు
close
Updated : 13/05/2020 09:15 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

భారత్‌ నుంచి పాక్‌కు ఔషధాలు

విచారణకు ఆదేశించిన ఇమ్రాన్‌ఖాన్‌

ఇస్లామాబాద్‌: భారత్‌ నుంచి 450 ప్రాణాధార ఔషధాలు అక్రమంగా దిగుమతి అయ్యాయన్న ఆరోపణలపై ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ విచారణకు ఆదేశించారు. భారత్‌ ఆర్టికల్‌-370ని రద్దు చేసిన అయితే కరోనా కారణంగా ప్రాణాధార ఔషధాలకు కొరత ఏర్పడటంతో... వాటితో పాటు మందుల తయారీకి అవసరమైన ముడిసరకును భారత్‌ నుంచి దిగుమతికి చేసుకునేందుకు అనుమతించింది. ఈ సడలింపును సాకుగా చేసుకుని భారత్‌ నుంచి విటమన్‌ మాత్రల వంటి ఔషధాలు దిగుమతి అవుతున్నాయంటూ మీడియాలో కథనాలు వచ్చాయి. ఈ విషయమై విపక్షాల నుంచి విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఇమ్రాన్‌ దర్యాప్తునకు ఆదేశించారు. కాగా... విదేశాల నుంచి తిరిగివచ్చే పాకిస్థానీయుల క్వారంటైన్‌ సమయాన్ని ప్రభుత్వం 48 గంటలకు కుదించింది. పరీక్షల్లో వారికి కరోనా లేదని తేలితే, ఆ సమయం తర్వాత వారిని ఇళ్లకు పంపేస్తారు. లేదంటే ఐసోలేషన్‌ కేంద్రాలకు తరలిస్తారు. పాక్‌లో కొత్తగా 1,733 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 32,674కు చేరింది. ఇప్పటివరకూ ఇక్కడ 724 మంది కరోనా కారణంగా మృతిచెందారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని