IN PICS: ‘చిత్రం’ చెప్పే విశేషాలు
close
Updated : 14/05/2020 19:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

IN PICS: ‘చిత్రం’ చెప్పే విశేషాలు

హైదరాబాద్‌ చందానగర్‌ నుంచి ఛత్తీస్‌ఘడ్‌కు బయలుదేరిన వలస కూలీలు ఏదైనా వాహనం దొరుకుతుందనే ఆశతో గండిపేట వద్ద బాహ్య వలయ రహదారి కంచెను దాటుతున్న దృశ్యం.


దిల్లీ నుంచి కోల్‌కతాలోని హవ్‌డా రైల్వే స్టేషన్‌కు చేరుకున్న ఓ కుటుంబం.. తన చిన్నారి కొడుకును ట్రాలీ బ్యాగుపై కూర్చొబెట్టుకుని లాక్కెళుతున్న తండ్రి.


ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక రైళ్లలో గుజరాత్‌ నుంచి ఉత్తర్‌ ప్రదేశ్‌ వెళ్లేందుకు సిద్దమైన వలస కార్మికులు. వీరంతా అహ్మదాబాద్‌ రైల్వే స్టేషన్‌కు చేరుకునేందుకు ఏర్పాటు చేసిన బస్సుల కోసం వేచి చూస్తున్నారు. 


దిల్లీ నుంచి పట్నా రైల్వే స్టేషన్‌కు చేరుకున్న ఓ ప్రయాణికుడి బ్యాగుపై కరోనా వైరస్‌ నివారణ రసాయనాన్ని పిచికారీ చేస్తున్న పారిశుద్ధ్య సిబ్బంది. 


రాజస్థాన్‌ జోధ్‌పూర్‌లో వివాహ వేదికపై మాస్క్‌ ధరిస్తున్న వధువుకు సాయం చేస్తున్న వరుడు.


లాక్‌డౌన్‌తో నిర్మానుష్యంగా మారిన జైపూర్‌లోని జయగఢ్ కోట సమీపంలోని రహదారిపై స్వేచ్ఛగా తిరుగుతున్న నెమళ్లు.


బెంగళూరు నుంచి స్వస్థలానికి వెళ్లేందుకు రైల్వే స్టేషన్‌ వరకు తీసుకెళ్లే బస్సు రావడంతో ఆనందం వ్యక్తం చేస్తున్న వృద్ధురాలు.


పంజాబ్‌ నుంచి స్వస్థలాలకు వెళ్లేందుకు భతిండా రైల్వే స్టేషన్‌కు వచ్చిన వలస కార్మికులను భౌతిక దూరం పాటించాల్సిందిగా కోరుతున్న పోలీసులు.


దిల్లీ-ఘాజీపూర్‌ సరిహద్దు వద్ద ఉత్తర్‌ప్రదేశ్‌ వెళ్తున్న వలస కూలీలకు చెప్పులు అందజేస్తున్న పోలీసు.


అమృత్‌సర్‌లో కురిసిన భారీ వర్షంతో వ్యవసాయ మార్కెట్‌లోకి చేరిన వర్షపు నీటిని తోడిపోస్తున్న కార్మికుడు.


హైదరాబాద్‌: బోయిన్‌పల్లి-మేడ్చల్‌ ప్రధాన రహదారిపై ప్రయాణించే ప్రజల దాహం తీర్చేందుకు మజ్జిగను పంపిణీ చేస్తున్న దాత.


బెంగళూరులో ఊయలూగుతున్న యువతుల చిత్రం ఎదురుగా చెట్టు ఊడ పట్టుకుని ఊగుతున్న బాలుడు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని