IN PICS: ‘చిత్రం’ చెప్పే విశేషాలు
close
Published : 18/05/2020 19:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

IN PICS: ‘చిత్రం’ చెప్పే విశేషాలు

యదాద్రి జిల్లా భూదాన్‌ పోచంపల్లిలో ఓ పండ్ల వ్యాపారి అమ్మగా మిగిలిన పండ్లను ప్రధాన రహదారి పక్కన వదిలేసి వెళ్లాడు. ఆహారం కోసం ఎదురుచూస్తున్న సమీపంలోని కోతులు పండ్లను చూసి ఆవురావురుమంటూ పరిగెత్తుకొచ్చి తింటుండగా ‘ఈనాడు’ కెమెరా క్లిక్‌మనిపించింది. 


ఇంటి నుంచి బయటకు వచ్చే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్‌ ధరించాలని ప్రభుత్వాలు చేస్తున్న విజ్ఞప్తి మంచి ఫలితాన్నిస్తుంది. హైదరాబాద్‌ కోఠి చౌరస్తాలో మాస్క్‌లు ధరించిన ద్విచక్ర వాహనదారులను చిత్రంలో చూడొచ్చు.


లాక్‌డౌన్‌ సడలింపులతో సికింద్రాబాద్‌ రాణిగంజ్‌లో వ్యాపార సంస్థలు సోమవారం తెరుచుకున్నాయి. ఇక్కడ అన్ని హోల్‌సేల్‌ దుకాణాలు కావడంతో కొనుగోలుదారులు భారీగా రావడంతో ట్రాఫిక్‌ స్తంభించింది.


లాక్‌డౌన్‌తో స్వస్థలాలకు వెళ్తున్న వలస కార్మికులకు దారి తెలియక ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్‌లోని మాల్స్‌లో పనిచేసే వీరంతా హఫీజ్‌ పేట నుంచి నాగ్‌పూర్‌ వెళ్లేందుకు కాలినడకన బయలుదేరారు. బాహ్య వలయ రహదారి సర్వీసు రోడ్డు మీదుగా వెళ్తున్న వీరు దారి తప్పి విజయవాడ రోడ్డులోకి వెళ్లారు. మార్గమధ్యలో వాహనచోదకులు కొందరు వీరి వివరాలు అడిగి నాగ్‌పూర్‌ వెళ్లే మార్గం చూపించారు. 


ఆర్టీసీ బస్సుల పునరుద్ధరణపై ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తుండగా అందుకు సంబంధించిన ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. బస్సులు ఎక్కేముందు ప్రయాణికులు చేతులు శుభ్రం చేసుకునేందుకు కాలితో తొక్కితే శానిటైజర్‌ వచ్చే యంత్రాలను సిద్దం చేశారు. అధికారులు చిత్తూరు డిపోలో వీటిని ఏర్పాటు చేశారు.


బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుపాను అంపన్‌ ప్రభావంతో విశాఖ సముద్ర తీరంలో ఉవ్వెత్తున్న ఎగిసిపడుతున్న అలలు.


లాక్‌డౌన్‌తో ఆస్పత్రుల్లో ఓపీ సేవలు నిలిపివేయడంతో గర్భిణీలు ఇంటికే పరిమితమయ్యారు. సోమవారం నుంచి ఓపీ సేవలు మొదలయ్యాయి. విశాఖ కనకమహాలక్ష్మీ గుడి సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రికి గర్భిణీలు అధిక సంఖ్యలో రావడంతో కూర్చునేందుకు కుర్చీలు లేక ఆరు బయట నిలబడాల్సి వచ్చింది.


దిల్లీ నుంచి సికింద్రాబాద్‌కు ప్రత్యేక రైలులో చేరుకున్న ప్రయాణికులకు రైల్వే స్టేషన్‌లో హోం క్వారంటైన్‌ స్టాంపులు వేస్తున్నారు. దీనిలో భాగంగా నెలల వయసున్న చిన్నారి చేతిపై స్టాంప్‌ వేస్తున్న ఆరోగ్య కార్యకర్త.


లాక్‌డౌన్‌ ఆంక్షలు సడలించడంతో దిల్లీ-ఉత్తర్‌ప్రదేశ్‌ సరిహద్దులో భారీ ట్రాఫిక్‌ జామ్‌ కారణంగా కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు.


లాక్‌డౌన్‌తో పరిశ్రమలు మూతపడి కాలుష్యం తగ్గడంతో జబల్పూర్‌లో స్వచ్ఛంగా కనిపిస్తున్న నర్మదా నది.


జనతాదళ్‌(ఎస్‌) అధినేత, మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ పుట్టిన రోజు సందర్భంగా బెంగళూరులోని పార్టీ ప్రధాన కార్యాలయంలో దేవెగౌడ, హెచ్‌డీ కుమారస్వామి ఇతర నాయకుల చిత్రాలు ముద్రించిన మాస్క్‌ను ధరించిన అభిమాని. 


పూరీ సముద్రం తీరంలో ‘అంపన్‌ తుఫాన్‌’ చిత్రాన్ని రూపొందించిన సైకత శిల్పి సుదర్శన్‌ పట్నాయక్‌. తుపాను ప్రభావం ఒడిశా, బెంగాల్‌లో అధికంగా ఉండే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.  


అహ్మదాబాద్‌లో వలస కార్మికులకు, భద్రతా సిబ్బందికి మధ్య జరిగిన ఘర్షణలో కార్మికుడిని లాఠీతో కొడుతున్న దృశ్యం.


 'ఫలక్‌నుమా దాస్'చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన దర్శకుడు, హీరో విశ్వక్‌ సేన్‌. మే 20 (బుధవారం) ఎన్టీఆర్‌ పుట్టిన రోజు సందర్భంగా ఆయనపై ప్రత్యేక గీతాన్ని విడుదల చేస్తున్నట్లు ట్విటర్‌ వేదికగా ప్రకటించారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని