లాక్‌డౌన్‌ వేళ ఇదో కన్నీటి గాథ
close
Updated : 19/05/2020 14:22 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

లాక్‌డౌన్‌ వేళ ఇదో కన్నీటి గాథ

కన్న కొడుకు చివరి చూపులకు నోచుకోలేని తండ్రి

ఇంటర్నెట్‌డెస్క్‌: కరోనా వైరస్‌ తెచ్చిన కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఒకవైపు దేశం లాక్‌డౌన్‌లో కొనసాగుతుంటే మరోవైపు వలసదార్ల కష్టాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారుతున్నాయి. ఈ నేపథ్యంలోనే దిల్లీలో ఓ జర్నలిస్టు తీసిన వలసదారుడి ఫొటో వైరల్‌గా మారింది. అది తన కన్నీటి గాథను ప్రపంచానికి తెలియజేసింది. 

బిహార్‌లోని బెగుసరాయ్‌కి చెందిన రామ్‌పుకార్‌(38) దిల్లీలో భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. కొద్ది రోజుల క్రితం నెలల వయసున్న తన కుమారుడి పరిస్థితి విషమించిందని తెలిసి ఇంటికి వెళ్లాలనుకున్నాడు. లాక్‌డౌన్‌ వేళ కాలినడకన ప్రయాణం సాగించినా.. దిల్లీలోని నిజాముద్దీన్‌ బ్రిడ్జి వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే తన కుమారుడి పరిస్థితి తెలుసుకొని రోడ్డు పక్కనే ఫోన్లో రోదిస్తూ కనిపించాడు. అప్పుడే ఓ ఫొటో జర్నలిస్టు అతడి ఫొటో తీశాడు. అతడితో మాట్లాడి విషయం తెలుసుకున్నాడు. తన కుమారుడిని చూసేందుకు బెగుసరాయ్‌లోని ఇంటికి వెళ్లాలనుకుంటున్నట్లు రామ్‌ ఆ జర్నలిస్టుతో చెప్పాడు. ‘ఆ జర్నలిస్టు నాకు సాయం చేసి పోలీసులతో మాట్లాడారు. అయినా వాళ్లు అనుమతించలేదు. తర్వాత ఓ మహిళ రూ.5500 ఇచ్చి భోజనం పెట్టారు. అలాగే నాకు రైలు టికెట్‌ తీసిచ్చారు. దాంతో నేను బెగుసరాయ్‌కి చేరుకున్నా. అప్పటికే నా కుమారుడు చనిపోయాడు. చివరి చూపులు కూడా దక్కలేదు’ అని రామ్‌పుకార్‌ తన బాధను పంచుకున్నాడు. తనకు సాయం అందడానికి ముందు మూడు రోజుల పాటు నిజాముద్దీన్‌ బ్రిడ్జి వద్దే ఉన్నానని చెప్పాడు.

శనివారం అతడు బెగుసరాయ్‌కి చేరగా అధికారులు క్వారంటైన్‌ కేంద్రానికి తరలించారు. మరుసటి రోజు అతడిని ఆస్పత్రికి తరలించి కొవిడ్‌ 19 పరీక్షలు నిర్వహించారు. తాను ఇక్కడికొచ్చినా ఇంకా భార్యా, పిల్లలను కలుసుకోలేకపోయానని రామ్‌పుకార్‌ వాపోయాడు. ’ఆస్పత్రిలో ఉండగా నా భార్య, కూతురు చూడ్డానికి వచ్చారు. మాస్కులు ధరించి దూరంగా ఉన్నారు. పది నిమిషాలే నాతో ఉన్నారు. వాళ్లను చూడగానే ఏడుపాగలేదు. ఒకర్నొకరు హత్తుకోవాలని అనుకున్నాం. నా కూతుర్ని తాకాలనిపించింది. కానీ అది సాధ్యపడలేదు.’ అని తన కన్నీటి గాథను మీడియాతో తెలిపాడు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని