చుట్టూ సింహాలు... అంబులెన్స్‌లో ప్రసవం
close
Published : 22/05/2020 01:37 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

చుట్టూ సింహాలు... అంబులెన్స్‌లో ప్రసవం

గిర్‌ సోమ్‌నాథ్‌: సింహాల గుంపు చుట్టుముట్టి అంబులెన్స్‌ను కదలకుండా చేయటంతో ఓ మహిళ అంబులెన్స్‌లోనే ప్రసవించాల్సి వచ్చింది. ఒళ్లు గగుర్పొడిచే ఈ సంఘటన గుజరాత్‌లోని గిర్‌ సోమ్‌నాథ్‌ ప్రాంతంలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి... ప్రసవ వేదనతో ఉన్న ఓ మహిళను ఆస్పత్రికి చేర్చేందుకు ఆమె ఇంటికి అంబులెన్స్‌ వచ్చింది. వారు మార్గమధ్యంలో ఉండగానే నాలుగు సింహాలు రోడ్డుపై కనిపించాయి. ఇక చేసేదేంలేక అంబులెన్స్‌ను కాస్త దూరంలో ఆపి వేచిచూడటం మొదలుపెట్టారు. ఇంతలో నొప్పులు తీవ్రం కావటంతో అత్యవసర వైద్య సిబ్బంది సహకారంతో ఆ మహిళ అంబులెన్స్‌లోనే ప్రసవించింది. ఆ సింహాలు 20 నిముషాలకు పైగా అదే ప్రాంతంలో తచ్చాడాయని వారు తెలిపారు. చివరకు అవి మరలిపోయిన అనంతరం వారు ఉన్న అంబులెన్స్‌ ఆస్పత్రికి చేరుకుంది. తల్లీ బిడ్డలకు అవసరమైన వైద్య సేవలు అందించామని... వారిద్దరూ క్షేమంగా ఉన్నారని వైద్య సిబ్బంది తెలిపారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని