ఆయన పథకాలు దేశానికి ఆదర్శం: బాలకృష్ణ
close
Published : 28/05/2020 10:46 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆయన పథకాలు దేశానికి ఆదర్శం: బాలకృష్ణ

హైదరాబాద్‌: ఎన్టీఆర్‌ 97వ జయంతి సందర్భంగా గురువారం ఉదయం నెక్లెస్‌ రోడ్‌లోని ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద ఆయన కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మీడియాతో మాట్లాడుతూ.. తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన వ్యక్తి ఎన్టీఆర్‌ అని కొనియాడారు. ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయన్నారు. ‘‘ఎన్టీఆర్‌ నటించిన సినిమాలు చరిత్రలో నిలిచిపోతాయి. ఆయన్ను స్ఫూర్తిగా తీసుకుని ముందుకెళ్లాలి. విప్లవాత్మక పథకాలతో ప్రజల గుండెల్లో నిలిచారు’’ అని వివరించారు.

సినీ పరిశ్రమ పునఃప్రారంభంపై ప్రభుత్వంతో చర్చలు జరుగుతున్నాయి. జూన్‌ రెండో వారం నుంచి ప్రారంభమయ్యే అవకాశముంది. చిత్రీకరణ తుదిదశకు వచ్చిన సినిమాలకు ముందు అవకాశం ఇవ్వాలని సూచించా. జీవో వచ్చాక సినిమాల చిత్రీకరణలు ప్రారంభమవుతాయి’’ అని బాలకృష్ణ తెలిపారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని