మళ్లీ పదవిలోకి వచ్చా: రమేశ్‌ కుమార్‌
close
Updated : 29/05/2020 19:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మళ్లీ పదవిలోకి వచ్చా: రమేశ్‌ కుమార్‌

అమరావతి: ఏపీ హైకోర్టు తీర్పు ప్రకారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా మళ్లీ పదవిలోకి వచ్చానని నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ తెలిపారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ మార్పు వ్యవహారంపై హైకోర్టు తీర్పు వెల్లడించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ...పరిస్థితులన్నీ అనుకూలించాక స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ప్రారంభించాలనుకుంటున్నట్టు చెప్పారు. గతంలో మాదిరిగా నిష్పక్షపాతంగా పనిచేస్తానని స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలపై రాజకీయ పార్టీలతో త్వరలోనే సమావేశం ఏర్పాటు చేస్తానని వివరించారు. వ్యక్తులు శాశ్వతంగా ఉండరని,  రాజ్యాంగ సంస్థలు, వాటి విలువలు చిరస్థాయిగా ఉంటాయని రమేశ్‌ కుమార్‌ అన్నారు.

2016 జనవరి 30న అప్పటి తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ను అయిదేళ్ల కాలానికి రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నియమించారు. రమేశ్‌కుమార్‌ 2016 ఏప్రిల్‌ 1న బాధ్యతలు చేపట్టారు. ఆయన పదవీకాలం 2021 మార్చి నెలాఖరు వరకు ఉంది.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని