వలస కార్మికులపై బిస్కట్లను విసిరిన ఉద్యోగి
close
Updated : 31/05/2020 23:24 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వలస కార్మికులపై బిస్కట్లను విసిరిన ఉద్యోగి

విషయం తెలిసి సంబంధిత అధికారిపై రైల్వే శాఖ వేటు..

లఖనవూ: శ్రామిక్‌ రైలులో ఇటీవల స్వస్థలాలకు వెళ్తున్న వలసకార్మికుల పట్ల ఉత్తర్‌ప్రదేశ్‌ రైల్వే సిబ్బంది ప్రవర్తించిన తీరు వివాదాస్పదంగా మారింది. దీంతో సంబంధిత అధికారిపై వేటు పడింది. వివరాల్లోకెళితే.. మే 25న ఓ శ్రామిక్‌ రైలు ఫిరోజాబాద్‌ రైల్వేస్టేషన్‌లో ఆగి ఉన్నప్పుడు డీకే దీక్షిత్‌ అనే ఓ రైల్వే ఉద్యోగి తన సిబ్బందితో కలిసి వలసదార్లకు బిస్కట్‌ ప్యాకెట్ల పంపిణీ చేపట్టాడు. ఆ సిబ్బంది ప్యాకెట్లను నేరుగా ప్రయాణికుల చేతికి ఇవ్వకుండా ప్లాట్‌ఫామ్‌ పైనుంచే రైల్లోకి విసిరారు. తమ అధికారి పుట్టిన రోజు సందర్భంగా బిస్కట్లు ఇస్తున్నామని చెప్పారు. కొందరికి ఆ ప్యాకెట్లు అందకపోవడంతో మరిన్ని అడిగారు. అందుకు వారిని దూషిస్తూ వేరే వాళ్లకు ఇచ్చిన వాటిని పంచుకోవాలని బాధ్యతారాహిత్యంగా చెప్పడం గమనార్హం. 

ఈ ఘటనంతా ఓ వీడియోలో రికార్డవ్వగా అది స్థానిక రైల్వే ఉద్యోగుల వాట్సాప్‌ గ్రూపులో చేరింది. అది కాస్త సామాజిక మాధ్యమాలకు చేరడంతో ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. సంబంధిత అధికారి దీక్షిత్‌ను సస్పెండ్‌ చేశారు. కరోనా వైరస్‌ నేపథ్యంలో మార్చిలో లాక్‌డౌన్‌ విధించగా, అప్పటి నుంచీ లక్షలాది మంది వలసదార్లు కాలిబాటన స్వస్థలాలకు పయనమయ్యారు. ఈ క్రమంలో అనేక మంది ప్రమాదాలబారిన పడి మృతిచెందారు. దీంతో ఇటీవల కేంద్ర ప్రభుత్వం శ్రామిక్‌ రైళ్లను ఏర్పాటు చేసి వలస కార్మికులను స్వస్థలాలకు చేరుస్తోంది. అయితే, ఈ ప్రత్యేక రైళ్లలో సరైన వసతులు లేవని చాలా మంది  ఫిర్యాదులు చేశారు. 

ఇవీ చదవండి:

2,416 మంది పోలీసులకు కరోనా!

క్వారంటైన్‌లో ప్రసవ వేదనమరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని