ఇది ముమ్మాటికీ కోర్టు ధిక్కరణే: నిమ్మగడ్డ 
close
Updated : 31/05/2020 18:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఇది ముమ్మాటికీ కోర్టు ధిక్కరణే: నిమ్మగడ్డ 

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ (ఎస్‌ఈసీ)గా తనను పూర్తికాలం పదవిలో కొనసాగేలా ఏపీ హైకోర్టు తీర్పు ఇచ్చిందని నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ తెలిపారు. ఎస్‌ఈసీ వ్యవహారంలో ఏపీ అడ్వొకేట్‌ జనరల్‌ శ్రీరాం చేసిన వ్యాఖ్యలపై నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ స్పందించారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. హైకోర్టు తీర్పు ఇచ్చినా ప్రభుత్వం అమలు చేయకపోవడం సరికాదన్నారు. ఇది ముమ్మాటికీ హైకోర్టు తీర్పును ధిక్కరించడమే అవుతుందన్నారు. ఎన్నికల సంఘం స్వయం ప్రతిపత్తిని, స్వతంత్రతను ప్రభుత్వం అంగీకరించడం లేదని అభిప్రాయపడ్డారు. వచ్చే ఏడాది మార్చి 31 వరకు తన పదవీకాలం ఉందని నిమ్మగడ్డ తన ప్రకటనలో తెలిపారు.

తన నియామకం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కోర్టు ధిక్కరణకు పాల్పడిందని.. హైకోర్టు తీర్పును ప్రభుత్వం గౌరవించట్లేదని నిమ్మగడ్డ తరఫు న్యాయవాది పిటిషన్‌ వేయనున్నారు. రేపు హైకోర్టు సమ్మర్‌ వెకేషన్‌ బెంచ్‌ ముందు పిటిషన్‌ దాఖలు చేయనున్నట్లు తెలుస్తోంది.

ఇదీ చదవండి..
రమేశ్‌కుమార్‌ నియామకమే చట్టవిరుద్ధం
 


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని