వేదాద్రి ఘటన దిగ్భ్రాంతికరం: పవన్‌ కల్యాణ్‌
close
Updated : 18/06/2020 00:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వేదాద్రి ఘటన దిగ్భ్రాంతికరం: పవన్‌ కల్యాణ్‌

అమరావతి: కృష్ణా జిల్లా వేదాద్రి దగ్గర చోటు చేసుకున్న రోడ్డు ప్రమాద ఘటనపై జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ స్పందించారు. 12 మంది చనిపోయారని తెలిసి దిగ్భ్రాంతికి గురైనట్లు తెలిపారు. మృతుల కుటుంబాలకు వ్యక్తిగతంగా, పార్టీ తరఫున ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు.  క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కోరారు. తెలంగాణలోని పెద గోపవరం గ్రామస్థులు వేదాద్రి నరసింహస్వామి దర్శనం చేసుకొని వస్తుండగా  ఘోర ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. జగ్గయ్యపేట మండలం వేదాద్రి వద్ద ట్రాక్టర్‌- లారీ ఢీకొని 12 మంది దుర్మరణం పాలయ్యారు. ట్రాక్టర్‌లో ప్రయాణిస్తున్న ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఐదుగురు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. ఈ ఘటనలో బాధితులకు అవసరమైన సహాయం, వైద్య సేవలు అందించేందుకు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పని చేయాలని పవన్‌ కల్యాణ్‌ కోరారు. ‘‘ లారీ ఢీ కొట్టడంతో ఘటనా స్థలంలోనే ఏడుగురు చనిపోయారంటే ప్రమాద తీవ్రతను అంచనా వేయవచ్చు.  గ్రామీణ ప్రాంతాల్లో సైతం మితిమీరిన వేగంతో లారీలు, ఇసుక టిప్పర్లు, ఇతర సరకు రవాణా వాహనాలు తిరుగుతున్నాయని, వాటి వల్ల భయమేస్తోందని ప్రజలు వాపోతున్నారు. రవాణా, పోలీసు శాఖలు అప్రమత్తమై రహదారి భద్రత నియమాలు అమలు చేయాలి’’ అని పవన్‌ కోరారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని