మట్టికట్టే మరణశయ్య..
close
Published : 24/06/2020 09:29 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మట్టికట్టే మరణశయ్య..

 నిద్రలోనే కన్నుమూసిన లారీ డ్రైవర్‌

మల్కపేట(కోనరావుపేట), న్యూస్‌టుడే: తమిళనాడు నుంచి ఉపాధి కోసం వచ్చిన వ్యక్తి నిద్రిస్తుండగానే ప్రాణాలు మట్టిలో కలిసిపోయాయి. టిప్పర్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్న అతడు రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మల్కపేటలో అత్యంత దయనీయంగా మృత్యువాతపడ్డాడు. తమిళనాడు రాష్ట్రం తూత్తుకుడి జిల్లా సంపాడికి గ్రామానికి చెందిన సెల్వరాజ్‌(33) మల్కపేట జలాశయం మట్టికట్ట నిర్మాణం పనుల్లో లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. సోమవారం సాయంత్రం విధులు పూర్తయ్యాక పనులు జరుగుతున్న మట్టికట్టపైనే నిద్రకు ఉపక్రమించాడు. రాత్రి మరో డ్రైవరు అతడు నిద్రిస్తున్న విషయం గమనించకుండా టిప్పర్‌లో తీసుకువచ్చిన మట్టిని నిద్రిస్తున్న అతనిపై పోశాడు. మంగళవారం ఉదయం మట్టి కుప్పలను చదును చేస్తున్న డోజర్‌ యంత్రానికి అతడి మృతదేహం తగిలి బయటపడింది. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా సంఘటనా స్థలాన్ని సీఐ మొగిలి, ఎస్సై పరుశురాములు పరిశీలించారు. మృతుడి కుటుంబ సభ్యులు అందుబాటులో లేకపోవడంతో వీఆర్వో అనిల్‌కుమార్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని