HYDలో 2,192 మంది హోం క్వారంటైన్‌
close
Published : 24/06/2020 20:49 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

HYDలో 2,192 మంది హోం క్వారంటైన్‌

జీహెచ్ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌ కుమార్‌

హైదరాబాద్‌: హోం క్వారంటైన్‌లో ఉన్న వ్యక్తుల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌ కుమార్‌ తెలిపారు. రోజూ రెండు విడతలుగా కంట్రోల్‌రూం నుంచి ఆరోగ్య పరిస్థితిని మోనిటరింగ్‌ చేస్తున్నామన్నారు. కరోనా కట్టడికి, అత్యవసర వైద్యం అవసరమున్న రోగులను ఆసుపత్రులకు తరలించడానికి, హోంక్వారంటైన్‌ చేయడానికి... జీహెచ్‌ఎంసీ, వైద్యారోగ్య, పోలీసు శాఖలతో కలిసి పని చేస్తున్నామని కమిషనర్‌ తెలిపారు.

‘‘నగరంలో 2,192 మంది హోం క్వారంటైన్‌లో ఉన్నారు. ప్రస్తుతం కరోనా బాధితులు ఉంటున్న ఇంటిని మాత్రమే కంటైన్‌మెంట్‌ చేస్తున్నాం. గతంలో లాగా కాలనీ అంతటిని కంటైన్‌మెంట్ చేసి బారికేడ్లు ఏర్పాటు చేస్తే వాటిని తొలగించడానికి ఆలస్యమవుతోంది. దీంతోపాటు కరోనా బాధితులకు సత్వర వైద్య సేవలు అందించడానికీ ఆలస్యమవుతోంది’’ అని లోకేశ్‌ కుమార్‌ చెప్పారు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని