రెండోసారి నెగిటివ్‌ రావడానికి కారణముంది!
close
Published : 26/06/2020 00:15 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రెండోసారి నెగిటివ్‌ రావడానికి కారణముంది!

దీపక్‌ రెడ్డి కరోనా ఫలితంపై ఏపీ వైద్యారోగ్య శాఖ

విజయవాడ: ‘‘ఆర్టీపీసీఆర్‌ టెస్టుల్లో కచ్చితత్వం 67 శాతం మాత్రమే. వ్యక్తి శరీరంలో 33శాతం వైరస్‌ ఉనికి ఉన్నా నెగిటివ్‌గా చూపిస్తాయి’’ అని ఏపీ వైద్యారోగ్య శాఖ తెలిపింది. ఎమ్మెల్సీ దీపక్‌ రెడ్డికి చేసిన కరోనా పరీక్షల ఫలితాల విషయంలో ఆంధ్రప్రదేశ్‌ వైద్యారోగ్య శాఖ వివరణ ఇచ్చింది. కరోనా పరీక్షల విషయంలో ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరిస్తోందని  చెప్పింది. 

దీపక్‌ రెడ్డికి కరోనా లేకపోయినా ఏపీలో చేసిన పరీక్షల్లో పాజిటివ్‌ వచ్చిందంటూ తెదేపా వాదిస్తోంది. ఈ మేరకు తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ట్వీట్‌ కూడా చేశారు. దీనిపై వైద్యారోగ్య శాఖ వివరణ ఇచ్చింది. ‘‘ఇన్‌ఫెక్టెడ్‌ వ్యక్తిలో వైరస్‌ 100 శాతం ఉంటే ఫలితాలు పాజిటివ్‌గా నిర్ధరించవచ్చు. కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ అయితే వైరల్‌ ఇన్ఫెక్షన్‌ తీవ్రంగా ఉన్నట్టే. ఎవరైనా ఇన్‌ఫెక్టెడ్‌ రోగి చికిత్స చివరిదశలో ఉన్నా నెగిటివ్‌ రావొచ్చు. దీపక్‌ రెడ్డి తొలి ఫలితాలు పాజిటివ్‌గా వస్తే వంద శాతం ఇన్ఫెక్షన్‌కు గురైనట్లే. రెండో విడత పరీక్షలో నెగిటివ్‌ రావడానికి కారణం ఉంది. ఆయనలో ఇన్ఫెక్షన్‌ స్థాయి 33 శాతం లోపుగా ఉండటమే కారణం’’ అని వైద్యారోగ్య శాఖ తెలిపింది.

తొలుత దీపక్‌రెడ్డికి చేసిన కరోనా పరీక్షల్లో పాజిటివ్‌ అని తేలినట్లు గుర్తించారు. అయితే ఆయన హైదరాబాద్‌లో రెండుసార్లు పీసీఆర్‌ టెస్టులు చేయించుకోగా, నెగిటివ్‌ అని రావడం గమనార్హం.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని