అమానవీయంగా ప్రవర్తించినందుకు వేటు
close
Updated : 27/06/2020 04:14 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అమానవీయంగా ప్రవర్తించినందుకు వేటు

అమరావతి: శ్రీకాకుళం జిల్లా పలాసలో కరోనా కారణంగా మృతిచెందిన వ్యక్తి అంత్యక్రియల విషయంలో అమానవీయంగా ప్రవర్తించినందుకు ముఖ్యమంత్రి కార్యాలయం ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో ఇద్దరు అధికారులపై వేటు పడింది. వివరాల్లోకి వెళితే..  ఇటీవల పలాసలో కరోనాతో వ్యక్తి మృతిచెందాడు. దీంతో అతని మృతదేహాన్ని పొక్లెయిన్‌లో తరలించారు. ఈ అంత్యక్రియల ఉదంతం ముఖ్యమంత్రి కార్యాలయ అధికారుల దృష్టికి వచ్చింది. దీంతో శ్రీకాకుళం జిల్లా కలెక్టర్‌తో సీఎంఓ అధికారులు మాట్లాడి ఘటన వివరాలు తెలుసుకున్నారు. ఇలాంటి సమయాల్లో ఎలా వ్యవహరించాలన్నదానిపై స్పష్టమైన ప్రోటోకాల్‌ ఉన్నప్పటికీ ,నిబంధనలు ఉల్లంఘించి పొక్లెయిన్‌ ద్వారా మృతదేహాన్ని తరలించడం అమానవీయమని అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీంతో శ్రీకాకుళం జిల్లా కలెక్టర్‌ నివాస్‌ విచారణ జరిపి పలాస మున్సిపల్‌ కమిషనర్‌ టి.నాగేంద్రకుమార్‌, శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ ఎన్‌.రాజీవ్‌ను సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కరోనా సోకిన వారి విషయంలో వివక్ష లేకుండా, అమానవీయ చర్యలకు దిగకుండా వైద్యారోగ్యశాఖ ఇదివరకే స్పష్టమైన నిబంధనలను జారీ చేసిందని ఈ సందర్భంగా ప్రభుత్వం మరోసారి జారీ చేసింది. మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని