కరోనా అంటించారని రూ.6 లక్షల జరిమానా
close
Updated : 28/06/2020 05:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కరోనా అంటించారని రూ.6 లక్షల జరిమానా

జైపూర్‌: దేశంలో ఓ వైపు కొవిడ్‌-19 ఉద్ధృతి కొనసాగుతుండగా.. మరోవైపు కొందరు నిబంధనలు ఉల్లంఘిస్తూ వివాహలు, పలు శుభకార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. నిబంధనలు తప్పకుండా పాటించాలని ప్రభుత్వాలు ఎంత చెప్పిన పెడచెవిన పెడుతున్నారు. నిర్లక్ష్యం కారణంగా పెద్ద ఎత్తున కరోనా కేసులు నమోదవుతున్నాయి. దీనికి పరిష్కారంగా ఓ కలెక్టర్‌ వినూత్ననంగా ఆలోచించాడు. కొవిడ్‌ నిబంధనలు ఉల్లంఘించి 15 మందికి కరోనా సోకడానికి కారణమైన ఓ కుటుంబానికి రూ.6 లక్షలకుపైగా జరిమానా విధించారు. 

రాజస్థాన్‌లోని భిల్వారా జిల్లాకు చెందిన గీసులాల్‌ రాఠీ ఈ నెల 13న తన కుమారుడి వివాహం జరిపించాడు. కరోనా ముప్పు నేపథ్యంలో శుభకార్యక్రమాలకు కేవలం 50 మంది అతిథులకే అధికారుల అనుమతి ఉంది. ఈ నిబంధనలను లెక్కచేయని ఆ కుటుంబం వివాహ వేడుకకు భారీ సంఖ్యలో అతిథులను పెళ్లికి ఆహ్వానించింది. అనంతరం ఈ వేడుకకు హాజరైన వారిలో 15 మందికి కరోనా సోకినట్లు తేలింది. వీరిలో ఒకరు తీవ్ర లక్షణాలతో బాధపడుతూ చనిపోయారు. ఈ ఘటనకు కారణమైన గీసులాల్‌ రాఠీపై పోలీసులు ఈ నెల 22న కేసు నమోదు చేశారు. 

అయితే కరోనా సోకిన 15 మందిని ప్రభుత్వం ఐసోలేషన్‌ కేంద్రాల్లో ఉంచి చికిత్స అందించింది. వీరి కరోనా పరీక్షలకు, చికిత్సకు, ఆహారానికి, అంబులెన్స్‌కు మొత్తంగా రూ.6,26,600 ఖర్చు అయింది. నిర్లక్ష్యం వహించి ఇంతమందికి కరోనా సోకడానికి కారణమైన వ్యక్తి నుంచే డబ్బులు రాబట్టాలని జిల్లా కలెక్టర్‌ రాజేంద్ర భట్‌ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జరిమానా విధించిన డబ్బును సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు డిపాజిట్‌ చేయాలని సూచించారు. మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని