తెలంగాణలో కొత్తగా 983 కరోనా కేసులు
close
Published : 28/06/2020 21:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

తెలంగాణలో కొత్తగా 983 కరోనా కేసులు

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో నానాటికీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో 983 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది.  దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 14,419 చేరింది. తాజాగా 244మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జీ కాగా, మొత్తం కోలుకున్న వారి సంఖ్య 5,172గా ఉంది. ఈరోజు సాయంత్రం 5గంటల వరకూ 4గురు కరోనాతో మృతి చెందగా, మొత్తం మృతుల సంఖ్య 247కు చేరింది.

జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 816

రాష్ట్రంలో నమోదయ్యే అత్యధిక కేసులు గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌(జీహెచ్‌ఎంసీ)లోనే నమోదు కావడం విశేషం. గత 24 గంటల్లో అత్యధికంగా 816 కేసులు నమోదయ్యాయి. ఇక జిల్లా వారీగా చూస్తే, రంగారెడ్డి-47 , మేడ్చల్-29 , నల్గొండ-3 , సంగారెడ్డి-1, భద్రాద్రి కొత్త  గూడెం-5, కరీంనగర్-3, సిద్దిపేట-3, వరంగల్ అర్బన్-12, మహబూబ్ నగర్-1, ఆదిలాబాద్-2, ఖమ్మం-3, జనగామ-1, మంచిర్యాల-33, మెదక్-1 , సూర్యాపేట-1, గద్వాల్-2, నిజామాబాద్-1, వరంగల్ రూరల్- 19 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని