తెలంగాణలో కరోనా @ 16వేలు దాటాయ్‌..
close
Updated : 30/06/2020 21:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

తెలంగాణలో కరోనా @ 16వేలు దాటాయ్‌..

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో కరోనా విలయం కొనసాగుతోంది. రోజురోజుకీ పెరిగిపోతున్న కేసులు ప్రజలను తీవ్ర కలవరానికి గురిచేస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో 945 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 16,339 చేరింది. 

కొత్తగా 7 మరణాలు.. 1712మంది డిశ్చార్జి

ఈ సాయంత్రం 5 గంటల వరకు రాష్ట్రంలో మరో ఏడుగురు మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 260కి పెరిగింది. తాజాగా మరో 1,712 మంది కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు కోలుకొని డిశ్చార్జి అయిన వారి సంఖ్య 7,294కి పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో 8785మంది చికిత్స పొందుతున్నారు.

హైదరాబాద్‌పై పంజా

గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. కొత్తగా మరో 869 కేసులు నమోదయ్యాయి. ఈ రోజు హైదరాబాద్‌ తర్వాత అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో 29, సంగారెడ్డి 21, మేడ్చల్‌ 13 కేసుల చొప్పున నమోదయ్యాయి.

జిల్లాల వారీగా నమోదైన కేసులను పరిశీలిస్తే..



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని