కరోనా: తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం
close
Published : 01/07/2020 14:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కరోనా: తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం

హైదరాబాద్‌: ‘‘కరోనా పరీక్షలు నిలిపివేస్తూ ప్రజారోగ్య డైరక్టర్ ఉత్తర్వులు ఇవ్వడం ఆశ్చర్యకరం. ఐసీఎంఆర్ నిబంధనలకు విరుద్ధంగా పీహెచ్ డైరెక్టర్ ఉత్తర్వులు ఉన్నాయి’’ తెలంగాణ హైకోర్టు అభిప్రాయపడింది. రాష్ట్రంలో కరోనా పరీక్షలు, మీడియా బులిటెన్‌లో అరకొర సమాచారం ఇస్తుండటంపై హైకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. హైకోర్టు ఆదేశాలను ప్రభుత్వం పెడచెవిన పెడుతోందని ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. మీడియా బులిటెన్‌లో వార్డుల వారీగా కీలక సమాచారం ఉండాలన్న ఆదేశాలు అమలు కావడంలేదని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. 

‘‘రాష్ట్రంలో కంటైన్మెంట్ విధానమేంటో తెలపాలి. కంటైన్మెంట్ ప్రాంతాల వివరాలు సమర్పించాలి. గత 20 రోజులుగా జరిగిన కరోనా పరీక్షల వివరాలు తెలపాలి. కేంద్ర బృందం పరిశీలనలో తేలిన అంశాలను సమర్పించండి. ఈ నెల 17లోగా న్యాయస్థానం ఉత్తర్వులను కచ్చితంగా అమలు చేయాలి. ఒకవేళ అమలు కాకపోతే ఈ నెల 20న సీఎస్‌, వైద్యారోగ్య, మున్సిపల్‌ ముఖ్య కార్యదర్శులు, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ కోర్టుకు హాజరుకావాల్సి ఉంటుంది’’ అని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని