ఏపీలో కొవిడ్‌ ప్రత్యేక జైళ్లు
close
Published : 08/07/2020 00:39 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఏపీలో కొవిడ్‌ ప్రత్యేక జైళ్లు

అమరావతి: రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తీవ్రమవుతున్న నేపథ్యంలో జైళ్లలో కరోనా వ్యాప్తి చెందకుండా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా రాష్ట్రంలో 13 కొవిడ్‌ ప్రత్యేక జైళ్లను ఏర్పాటు చేసింది. జిల్లాకో ప్రత్యేక కొవిడ్‌ జైలు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్తగా వచ్చే ఖైదీల వల్ల ఇతరులకు కరోనా సోకకుండా ఉండేందుకు ఈ జైళ్లను ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది. ఇకపై వచ్చే మగ ఖైదీలను తొలుత ప్రత్యేక జైళ్లకు తరలించి అక్కడ కరోనా పరీక్షలు నిర్వహించనున్నారు. కరోనా లేదని తేలితేనే కోర్టు సూచించిన జైలుకు ఖైదీలను పంపనున్నారు. ప్రత్యేక జైలు సిబ్బందికి కరోనా సోకకుండా రక్షణ చర్యలు కల్పించాలని జైళ్ల శాఖ డీజీని ప్రభుత్వం ఆదేశించింది. శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి, కాకినాడ, భీమవరం, మచిలీపట్నం, నరసరావుపేట, ప్రొద్దుటూరు, డోన్‌, గుత్తి, పీలేరు, కావలి, మార్కాపురం జైళ్లను కొవిడ్‌ ప్రత్యేక జైళ్లుగా మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. 



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని