మాజీ మంత్రి రామస్వామి మృతి
close
Updated : 09/07/2020 23:32 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మాజీ మంత్రి రామస్వామి మృతి

హైదరాబాద్‌: భాజపా నేత, మాజీ మంత్రి రామస్వామి(80) కన్నుమూశారు. కిడ్నీ సంబంధిత వ్యాధితో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. మహారాజ్‌గంజ్‌ నియోజకవర్గం నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. గడ్డం రామస్వామి మరణం పార్టీకి, పేదలకు తీరని లోటని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. భాజపా అభ్యున్నతికి ఆయన నిరంతరం కృషి చేశారన్నారు. ప్రత్యేక తెలంగాణ వచ్చేవరకు గడ్డం తీయనని శపథం చేసిన గొప్పనేత అని కొనియాడారు. 
రామస్వామి మృతికి హిమాచల్‌ ప్రదేశ్‌ గవర్నర్‌ దత్తాత్రేయ, మహారాష్ట్ర మాజీ గవర్నర్‌ విద్యాసాగర్‌రావు, సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.

 


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని