మండిపోతున్న రెమిడెసివిర్‌ ధర!
close
Published : 10/07/2020 07:24 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మండిపోతున్న రెమిడెసివిర్‌ ధర!

విచ్చలవిడిగా నల్లబజారుకు

దిల్లీ: కొవిడ్‌-19కు అత్యవసర చికిత్స సాధనంగా ఇటీవలే అనుమతి పొందిన రెమిడెసివిర్‌ ఔషధం దురాశపరులైన ఔషధ దుకాణ యజమానులకు, డీలర్లకు కాసుల వర్షం కురిపిస్తోంది. ప్రాణాపాయంలో ఉన్న కరోనా బాధితుల అవసరాన్ని ఆసరాగా చేసుకొని ఈ మందు రేటును అనేక రెట్లు పెంచి, జనాన్ని దారుణంగా దోచుకుంటున్నారు. ముఖ్యంగా దిల్లీలో ఔషధ దుకాణాల నుంచి విచ్చలవిడిగా నల్లబజారుకు తరలిపోతోంది. రోజురోజుకూ దీని ధర పెరిగిపోతోంది. దిల్లీలో ఇంతకుముందు బ్లాక్‌ మార్కెట్‌లో ఆ ఔషధం ధర రూ.15వేలుగా ఉండగా .. ఇప్పుడది దాదాపు రూ. 35 వేలకు ఎగబాకిందని కొవిడ్‌ బాధితుడి బంధువొకరు ‘ఈటీవీ భారత్‌’తో చెప్పారు. దక్షిణ, తూర్పు దిల్లీ, గురుగ్రామ్‌లో బ్లాక్‌మార్కెట్‌లో రెమిడెసివిర్‌ లభ్యమవుతోందని, అధీకృత డీలర్ల వద్ద మాత్రం లేదని తెలిపారు. ఇలాంటి కీలకమైన ఔషధాల ధరను కట్టడి చేయడానికి దేశంలో సమర్థ యంత్రాంగం లేదని విమర్శించారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని