అంబులెన్సు రాదు.. ఇంట్లోకి వెళ్లలేరు!
close
Published : 11/07/2020 09:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అంబులెన్సు రాదు.. ఇంట్లోకి వెళ్లలేరు!

విశాఖపట్నం (సీతంపేట), న్యూస్‌టుడే: ఒకవైపు కొవిడ్‌ పాజిటివ్‌ అన్న సమాచారం.. మరోవైపు అంబులెన్సు రాక నీరసం.. ఇంకోవైపు ఇంట్లోకి వెళ్లాలంటే ఆందోళన! విశాఖపట్నంలోని ఒక ఆలయంలో పనిచేసే ఉద్యోగికి దేవాదాయ శాఖ చేయించిన పరీక్షలలో పాజిటివ్‌ అని తేలింది. ఆ విషయాన్ని శుక్రవారం వార్డు వాలంటీర్‌ ఫోన్‌ చేసి తెలిపారు. మధ్యాహ్నం 108 అంబులెన్సు వస్తుందని, ఇంటి బయటే వేచి ఉండాలని ఆయనకు చెప్పారు. దాంతో ఆయన మధ్యాహ్నం ఒంటిగంట నుంచి ఫుట్‌పాత్‌ మీదే కూర్చున్నారు. కానీ, ఎంత ఎదురుచూసినా అంబులెన్సు రాలేదు. రాత్రి పొద్దుపోయిన తర్వాత ఆయన పరిస్థితి చూసి స్థానికులు కొంత అల్పాహారం, టీ అందించారు. 11 గంటల సమయంలో స్థానిక నాయకులు కొందరు.. అధికారులతో మాట్లాడేందుకు ప్రయత్నించినా జోన్‌2 కమిషనర్‌ సహా ఎవరూ అందుబాటులోకి రాలేదు. ఆసుపత్రుల్లో పడకలు ఖాళీ లేకపోవడం వల్లే అంబులెన్సు రాలేదని అంటున్నారు. చివరకు ఆయనను రాత్రికి వార్డు కార్యాలయంలో ఉంచి.. తెల్లారాక ఆసుపత్రికి తరలించాలని స్థానిక నాయకులు యోచిస్తున్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని