GHMC వెబ్‌సైట్‌లో కరోనా సమాచారం
close
Published : 13/07/2020 19:38 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

GHMC వెబ్‌సైట్‌లో కరోనా సమాచారం

హైదరాబాద్‌: నగరవాసులకు సంబంధించిన కరోనా సమాచారాన్ని జీహెచ్‌ఎంసీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతామని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌ కుమార్‌ తెలిపారు. పేషెంట్ ఐడీ,  వార్డు, స‌ర్కిల్‌, జోన‌ల్ స‌మాచారాన్ని వెబ్‌సైట్‌లో పొందుపరుస్తామని కమిషనర్‌ తెలిపారు. ఈ వివ‌రాల‌ను రోజువారీగా అప్‌డేట్ చేస్తామని ఆయన చెప్పారు. రెసిడెన్షియ‌ల్ వెల్ఫేర్ అసోసియేష‌న్లు, కాల‌నీ అసోసియేష‌న్లు ఈ వివ‌రాల‌ను చూసుకొని వైర‌స్ వ్యాప్తి నియంత్ర‌ణ‌కు సహకరించాలని లోకేశ్‌ కుమార్‌ కోరారు. 

‘‘కరోనా పాజిటివ్ వచ్చి ఇంటి వ‌ద్ద‌నే ఉంటూ వైద్య సేవ‌లు పొందుతున్నవారికి హోం ఐసోలేష‌న్ కిట్‌ల‌ను అందిస్తున్నాం.  దీని కోసం 20 వేల హోం ఐసోలేష‌న్ కిట్‌ల‌ను తెప్పించాం. వాటిలో 15 వేల కిట్‌ల‌ను పంపిణీ చేశాం. కేసుల సంఖ్య‌ను బ‌ట్టి మరిన్ని కిట్లను తెప్పించి అందజేస్తాం’’ అని కమిషనర్‌ చెప్పారు. 

‘‘కిట్‌లో తొమ్మిది ర‌కాల వ‌స్తువులు అందిస్తున్నాం. ప్ర‌తి కిట్‌లో విట‌మిన్‌ సి టాబ్లెట్లు 34, జింక్ టాబ్లెట్లు 17, బి కాంప్లెక్స్ టాబ్లెట్లు 17, ఒక శానిటైజ‌ర్ బాటిల్‌‌, ఒక హ్యాండ్ వాష్ లిక్విడ్ బాటిల్‌,  గ్లౌజ్‌లు, సోడియం హైపోక్లోరైట్ ద్రావణం ఉంటాయి. వీటితోపాటు హోం ఐసోలేష‌న్ బ్రోచ‌ర్‌ను ఇస్తున్నాం’’ అని లోకేశ్‌ కుమార్‌ తెలిపారు. 



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని