తెలంగాణలో 12,178 యాక్టివ్‌ కేసులు
close
Published : 14/07/2020 16:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

తెలంగాణలో 12,178 యాక్టివ్‌ కేసులు

వెల్లడించిన వైద్యారోగ్యశాఖ

హైదరాబాద్‌: ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో 12,178 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు వైద్యారోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలో రికవరీ రేటు 65.48 శాతంగా ఉన్నట్లు చెప్పారు. డైరెక్టర్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ అధికారి హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. కరోనా బాధితుల్లో కేవలం 1 శాతం మంది మాత్రమే చనిపోయారన్నారు. లాక్‌డౌన్‌ ఎత్తివేసిన తర్వాత ప్రజల కదలికలు ఎక్కువయ్యాయని, అందువల్లే కేసులు పెరుగుతున్నాయని వివరించారు. బోధనా కళాశాలల్లో కూడా కరోనా రోగులకు చికిత్స ఏర్పాట్లు చేస్తామన్నారు.

కరోనా లక్షణాలు ఉంటేనే పరీక్షలు చేయించుకోవాలని డైరెక్టర్ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ కోరారు. తెలంగాణలో 85శాతం మందిలో వైరస్‌ లక్షణాలు కనిపించడం లేదన్నారు. హోం ఐసోలేషన్‌ సదుపాయం లేనివారికి ప్రభుత్వ ఐసోలేషన్‌లో చికిత్స అందిస్తున్నామని, మొత్తం యాక్టివ్‌ కేసుల్లో 9786 మంది హోం ఐసోలేషన్‌లోనే ఉన్నారని ఆయన అన్నారు. హైదరాబాద్‌లోని టిమ్స్‌లోనూ సోమవారం నుంచి చికిత్స జరుగుతోందని గుర్తు చేశారు. 
జీహెచ్‌ఎంసీ పరిథిలో 98 ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా చికిత్సకు అనుమతులు ఉన్నాయన్నారు. ఇక నుంచి పడకల వివరాలను డ్యాష్‌ బోర్డులో ప్రదర్శిస్తామని చెప్పారు. ప్రజల సహాయార్థం 3 రకాల కాల్‌సెంటర్లు ఏర్పాటు చేశాం. 104కు ఫోన్‌ చేసి అన్ని రకాల సహాయాలు పొందవచ్చని తెలిపారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని